
MATALU NERCHINA CHILUKA - 60
by NARISHEPALLI LAKSHMI NARAYANA
₹60
In stock · 695 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మాటలు నేర్చిన చిలుక ఒకప్పుడు జల్లపల్లి అనే గ్రామంలో జంగమయ్య, వెంకటలక్ష్మి అనే దంపతులుండేవారు. జంగమయ్య దగ్గర్లో ఉన్న అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి, తెచ్చి సంతలో అమ్మేవాడు. ఒకరోజు పొరుగున ఉన్న కూడేరు నుంచి జంగమయ్య తమ్ముడు లింగమయ్య తన కూతురు పెళ్లికి అన్నను పిలవటానికి వచ్చాడు. తమ్ముడు రావటంవల్ల ఆరోజు జంగమయ్య అడవికి వెళ్లలేదు. ఇద్దరూ మాటల్లో పడ్డారు. ఇంట్లో పొయ్యి కిందికి కట్టెలు కావలసి రావటంతో వెంకటలక్ష్మి అడవికి వెళ్లింది. నెత్తిన కట్టెల మోపుతో తిరిగి వస్తున్న వెంకటలక్ష్మి దారిలో ఒక చిలుక పడుండటం గమనించింది. ఆమె దాన్ని చేతుల్లోకి తీసుకోగానే అది రెక్కలు రెపరెపలాడించింది. దాని కాళ్లకు నెత్తురు గాయాలవడం చూసి వెంటనే ఇంటికి తీసుకెళ్లి జరిగింది చెప్పి చిలుకను భర్త చేతికి అందించింది. జంగమయ్య ఆ గాయాలకు పసుపు రాశాడు. వెంకటలక్ష్మి భర్తతో "ముద్దులొలికే చిలుకను అమ్మవద్దు. ఇది మనకు మంచి కాలక్షేపాన్నిస్తుంది" అని అంది. అందుకు జంగమయ్య “వాటితో సరదాగా గడపటానికి సమయం ఎక్కుడుంటుంది? అమ్మేస్తాను. అయితే ఈ చిలుకకు రెండు, మూడు మాటలు నేర్పితే, మాట్లాడే చిలుకను చూసి జనం పోగవుతారు. సమయం వచ్చినప్పుడు దీన్ని కూడా మంచి ధరకు అమ్మేయవచ్చు" అన్నాడు.