MATRUBHASHA MAHATMUDI BAATA by DR.G.V.PURNACHANDU Telugu book cover

MATRUBHASHA MAHATMUDI BAATA

by DR.G.V.PURNACHANDU

₹50
In stock · 38 available
PublisherDR.G.V.PURNACHANDU
LanguageTelugu
మాతృభాష- మహాత్ముడి బాట డా. జి వి పూర్ణచందు 1915 ఏప్రియల్ 21న మద్రాసులో గాంధీజీ ఆంధ్రపత్రిక విలేకరితో సంభాషించినప్పుడు మాతృభాషల గురించి ఆయన అభిప్రాయాలు స్పష్టమైనాయి. "నాతో అన్ని భాషలవారూ ఉన్నారు. అందులో ద్రావిడభాషలు మాట్లాడేవారూ ఉన్నారు. హైందవభూమి మొత్తానికి ఏకభాష అనేది సాధ్యం కాగలదు. అది హిందీయేనని నా మతం, దాక్షిణాత్యులు హిందీ అద్భుతంగా నేర్చుకోగలరు. మా ఫోనిక్స్ ఆశ్రమంలో గోవిందస్వామిగారి భార్య ఆంధ్రవనిత, తెలుగు, అరవం, హిందీ ఇంగ్లీషు, జూలూ భాషలను ఆమె అవలీలగా మాట్లాడగలదు. ఆమె పుత్రికలకూ ఈ భాషలు వచ్చు. మనదేశీయులకు ఇతర భాషలు సులువుగా పట్టుపడగలవు". “ఇప్పటి పరిస్థితి చూస్తే ఇంగ్లీషే ప్రాబల్యంలో ఉంది. మనం దేశభాషలను అలక్ష్యం చేసి, దురవస్థలపాలు జేసినంతకాలం ఈ ప్రాబల్యం హెచ్చుతూనే ఉంటుంది. ఈ స్థితి గౌరవప్రదం కాదు. మన లోపాలను కూడా సహించటం తప్పే. మొగలాయీల పాలనలో వారి భాషను అంగీకరించాము కాబట్టి, ఇప్పుడు ఆంగ్లేయులపాలనలో వీరి భాషను అంగీకరించాలనటం తప్పు. ఇది ఎలాంటి లోపమో అదికూడా అలాంటి లోపమే!". "దేశభాషలను నేర్చుకోవటం విద్యావంతుల విధి. ప్రతీ ఒక్కరూ విధిగా ఏదైనా భారతీయ భాషను నేర్చుకోవాలనేది నా అభిమతం. నేను అరవం, తెలుగు నేర్చుకుని మీతో సంభాషించగలను. మీరూ హిందీ నేర్చుకుని నాతో సంభాషిస్తే సంతోషిస్తా!"