MATTI MANISHI - NATAKAM by DR.VALLURU SIVAPRASAD Telugu book cover

MATTI MANISHI - NATAKAM

by DR.VALLURU SIVAPRASAD

₹185
In stock · 40 available
PublisherANDHRAPRADESH ABHYUDAYA RACHAITHALA SANGAM
LanguageTelugu
ISBN9788199853133
నాటక ప్రారంభం పంట చేను (చేలో కుప్ప నూర్పిడి చేయిస్తున్నాడు సాంబయ్య. కొయ్యబల్ల మీద మోపులు ఎడా పెడా బాదుతున్నారు ఎల్లమంద, ఏసోబులు. మరిద్దరు కూలీలు ధాన్యం రాల్చిన పనల్ని తీసుకెళ్లి కళ్లం మీద పడేస్తున్నారు. ఎద్దులు వడుపుగా కళ్లం తిరుగుతున్నాయి.) సాంబయ్య : వొరేయ్ ఎల్లమందా, ఏసోబూ! ఏందిరా ఆ కొట్టుడు? మన్నుతిన్న పాముల్లాగ.... అవున్లే కూటి కుండ బరువు పొట్ట కెక్కిందిగా.... పొద్దు వాలేలోపు నూర్పిడవ్వాలి.... కానీండి.... (గద్దించాడు) ఎల్ల : అయిపోద్దిలే దొరా! ఏసోబు : రాలుబడి బాగుందయ్యగారూ! పదిపుట్లకేం తక్కువరాదు. సాంబయ్య : ఉత్తినే దిగుబడి వస్తదేంట్రా. నాటేసిన కాడ్నుంచి పంట చేతికొచ్చేదాకా ఎంత కష్టం చెయ్యాలి. ఇంటో బిడ్డను సాకినట్టు పైరుని సాకితేనే బంగారం పండుద్ది..... ముచ్చట్లు బెట్టకుండా తెమల్చండి..... (కళ్లం తిరుగుతున్న ఎద్దుల్ని చూస్తూ) ఒరే నల్లోడా! ఏందా నత్తనడక.... నిద్రపోతన్నావేంట్రా.... అదిలించు. (కాస్త దగ్గరిలో రామి కేకలు పెడ్తూ రావటం కనిపించింది.) రామి : దొరగారూ! దొరగారూ! సాంబయ్య : నీ సిగతరగ! ఏందే ఆ పొలికేకలూ! రామి : అయ్యగారూ! అమ్మగారికి నొప్పులొచ్చినయ్! సాంబయ్య పిల్లా పిల్లాడా? రామి : ఇంకా పెసవం కాలేదు. నొప్పులు మోపుగా వున్నాయి. అమ్మగారు అల్లాడిపోతన్నారు. తొందరగా బయలుదేరండయ్యగారూ!