MAXIM GORKY KATHALU by MAXIM GORKY Telugu book cover

MAXIM GORKY KATHALU

by MAXIM GORKY

₹100
In stock · 709 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
వింత మనస్తత్వం ఈగర్ బీకొవ్ శరీరాన్ని తన చల్లని వేర్లతో తాటించి, రోగాన్ని అశ్రద్ధచేసి ముదర పెట్టేశారనీ, ప్రమాదస్థితికి చేతులారా తెచ్చుకున్నారనీ రాగి వెండ్రుకల డాక్టరు దృఢమైన తన బొంగురు కంఠంతో అనగానే టర్కీ యుద్ధంలో, తన యౌవనకాలంలో యెనిజాగ్రా వద్ద కాలికి తగిలిన గాయంతో హోరున కురిసే వర్షంలో, రివ్వున వీచే గాలిలో ముండ్ల పొదలమధ్య విపరీతమైన బాధతో పడివున్న నాటి గాఢరాత్రి కలిగిన భావమే బీకొవ్కు కలిగింది. తనకెవరో మహాద్రోహం చేశారనేదే ఆ భావం. "ఐతే, యింకేమీ ఆశ లేదనేనా మీ అభిప్రాయం?" అని అడిగాడతను. టేబిల్ ముందు ప్రిస్క్రిప్షన్ రాయడానికని కూర్చున్న డాక్టరు తుప్పు పట్టిన కలంతో తంటాలుపడుతూ ఏదో గొణిగాడు కాని కోపోద్రిక్తుడై కిటికీవద్ద నిలబడి గాలి తాకిడికి చెల్లాచెదురుగా ఎగురుతున్న యీకలను, వెండ్రుకలను, దుమ్మును దీక్షగా చూస్తున్న బీకొవ్ అదేమీ వినిపించుకోలేదు. "తాగుడు జాస్తి అయిపోయింది", అన్నాడు డాక్టరు. రోగి, మనస్సులో డాక్టర్ని శావనార్థాలు పెట్టుకుని నుండిపడుతూ అన్నాడు: "అది కారణమంటే మాత్రం 'నేనొప్పుకోను. చిత్తుగా తాగేవాళ్లెంతమంది లేరు? భూమిమీద నూకలు చెల్లిపోకముందే వాళ్లంతా చచ్చిపోతున్నారా?" ఆశ నిరాశ కాగా నీరసమైన స్వరంలో అతని ఆత్మ యీ విధంగా మొరపెట్ట నారంభించింది: "నీకన్న యే కోడి పెట్ట అయినా నయమే. అది గుడ్లు పెడుతుంది, పొదుగుతుంది, పిల్లలను తయారుచేసి తన వంశాన్ని శాశ్వతంగా భూమి మీద నిలబెట్టుకుంటుంది. కాని నువ్వేముంది? 5 శక్తియుక్తులు, తెలివితేటలు అన్నీ ఉపయోగించి సంపాదించినదంతా వదిలేసి చచ్చిపోతావు." డాక్టర్ని నిశ్శబ్దంగా గుమ్మంవరకు సాగనంపి చెప్పులనూ, బూడిద వర్ణపు అంగరఖానూ ధరించి చీకావ్ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. చప్పదవడల కోలముఖం మధ్య విచారపూరితమైన పచ్చని కళ్లు మెరుస్తున్నాయి. ఒత్తుగా పొడుగ్గా పెరిగిన గడ్డం రొమ్ము మీదకు వేలాడుతోంది. తన ముఖం తనకే రోతగా వుంది. దీర్ఘమైన నిట్టూర్పు విడిచి, నెమ్మదిగా ముంగిలి కిటికీవద్ద వున్న తోలు ఎడకకుర్చీలో బీకొవ్ కూలబడ్డాడు. అతనికి ఊపిరి తీసుకోవడమే కష్టంగా వుంది. రొమ్ములో కుడిపక్క పడేసి నములుతూన్నంత బాధగా వుంది. ఆ బాధ కాలేయంలో ప్రవేశించి నిస్సత్తువనూ, బక్కకోపాన్నీ రేపి ఎవరో మహాపరాధం చేశారనే వేదనను తన ఒడలంతా వ్యాపింపచేస్తూంది. మక్సీమ్ గోర్కీ కథలు వింత మనస్తత్వం