MAYA VISANAKARRA - 50.00 by D.K.CHADUVULA BABU Telugu book cover

MAYA VISANAKARRA - 50.00

by D.K.CHADUVULA BABU

₹50
In stock · 580 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
కొత్త చుట్టం సుబ్బమ్మ ఎవరినీ తొందరగా నమ్మేరకం కాదు. ఉన్న ఒక్క కూతురిని అత్తారింటికి పంపి, శక్త సంపాదించిన ఆస్తిని కాపాడుకుంటూ, ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. "గోనుపాడు సుబ్బమ్మగారల్లు ఇదేనాండి" అంటూ ఓ పాతికేళ్ల యువకుడు నేరుగా సుబ్బమ్మ ఇంట్లోకి వచ్చాడు. "నాకు తెలియని ఈ చుట్టం ఎవరా అనుకుంటూ ఎగాదిగా చూడసాగింది సుబ్బమ్మ, "నన్ను గుర్తుపట్టలేదా అవ్వా? నీ కూతురు అదే మా జానకి పిన్ని బావ శంకరయ్య లేదూ, ఆయన కొడుకు రామాన్ని ఈ ఊళ్లో కొంచెం పనుండి వచ్చాను. ఎక్కడో వుండడం దేనికి, మనింటికి వెళ్లు అంది పిన్ని" అంటూ పరిచయం చేసుకున్నాడు ఆ యువకుడు. తన కూతురు జానకి బావ శంకరయ్యే కాని, ఈ అబ్బాయిని ఎన్నడూ చూసినట్లు గుర్తులేదు. ఐనా ఇన్ని వివరాలు చెప్పినవాడు మావాడే అయివుంటాడు" అనుకొని చుట్టుపు మర్యాదలు బాగానే చేసింది సుబ్బమ్మ. "బయటికెళ్లొస్తానవ్వా" అంటూ వెళ్లిన రామం రాత్రికి తిరిగొచ్చాడు. "అబ్బబ్బా! ఈ ఆఫీసుల్లో ఒక్క పనీ త్వరగా జరిగిచావద్దు చూస్తుంటే నేనింకో రెండు మూడు రోజులదాకా ఉండాల్పేటట్టుంది. ఈ వయసులో నిన్ను కష్టపెట్టాలంటే నాకు బాధగా వుంది. వేరే ఎక్కడైనా వుంటానులే అవ్వా" చాలా -ఇబ్బందిగా పలికాడు రామం. "అదేంటయ్యా! నీవేం పరాయివాడివా మనవడివే కదా. అమాత్రం చూసుకోలేనా.. ఏం మొహమాటం పడవద్దు" అంది సుబ్బమ్మ.