MEDHADUKU METHA by DR.MAHIDHARA NALINI MOHAN Telugu book cover

MEDHADUKU METHA

by DR.MAHIDHARA NALINI MOHAN

₹110
In stock · 832 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
"బాబోయ్ నాకు లెక్కలంటే భయం. అందుకనే ఆర్ట్స్ గ్రూపు తీసుకున్నాను" అనే వారికి లెక్కలు అంటే సరదా కలిగించడానికి- “నాకు లెక్కలలో మంచి మార్కులే వస్తూ వుంటాయి” అని రొమ్ము విరుచుకునేవారిని తప్పుడు దోవలకు ఈడ్చుకుపోయే చిత్రమైన సమస్యలు కనబరచి, మెళకువ అవసరం సుమా అని చూపించడానికీ ఈ వ్యాసాలు రాశాను. ఇవి అర్ధం అవడానికి స్వయంగా ప్రయత్నించి సాధించడానికి గణితంలో పెద్ద ప్రావీణ్యం ఏమీ అవసరం లేదు. ఇందులో కేవలం తర్కంతో సాధించే సమస్యలు కొన్ని ఉన్నాయి. చూడగానే “ఇది చాలా గడ్డు సమస్యలా ఉంది, దీనికి పెద్ద పెద్ద సమీకరణాలు సాల్వు చేయవలసిందే" అనిపించి, తీరా చూస్తే “ఇంతేనా” అనిపించే సమస్యలు కొన్ని ఉన్నాయి. చూడటానికి చాలా సులభం అని భ్రమ కలిగించి, పప్పులో కాలు వేయించే సమస్యలు కొన్ని ఉన్నాయి. అన్ని సమస్యలకూ జవాబులిచ్చాను. అవసరమని తోచిన చోట్ల వివరణ ఇచ్చాను. వీటిలో కొన్నిటిని 1966-67 సంవత్సరాలలో ఆంధ్ర సచిత్ర వారపత్రిక లోనూ, 152 నుంచి 200 సమస్యల వరకూ 1979లో ఈనాడు దినపత్రికలోనూ ప్రచురించిన ఆయా పత్రికా సంపాదకులకు కృతజ్ఞుణ్ణి.