MEDHAMAGICS - 40 by N.V.R.SATYANARAYANA MURTHY Telugu book cover

MEDHAMAGICS - 40

by N.V.R.SATYANARAYANA MURTHY

₹40
In stock · 818 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ప్రక్క ప్రక్క సంఖ్యలలో ఒక తమాషా! ఏ రెండు ప్రక్క ప్రక్క సంఖ్యలనైనా తీసుకోండి. వాటిని ఈ క్రింది విధంగా తమాషాగా వ్రాయగలం! 1 * 2 = 1 * 1 + 1 2 * 3 = 2 * 2 + 2 3 * 4 = 3 * 3 + 3 4 * 5 = 4 * 4 + 4 5 * 6 = 5 * 5 + 5 6 * 7 = 6 * 6 + 6 8,9 ప్రక్క సంఖ్యలు కదా! 8 * 9 = 8 * 8 + 8 8 * 9 = 72 సరిపోయింది కదూ! 8 * 8 + 8 = 64 + 8 = 72 మీరు మరికొన్ని వ్రాసి చూడండి. “వర్గమూలమునకు ఒకటి కలిపితే!”) ఒక విద్యార్థి నాకు గ్రీటింగ్స్ పంపిస్తూ 1 ^ 2 * 3 ^ 2 * 3 ^ 2 * 1 ^ 2 సంవత్సరం మీకు అన్ని విధాల బాగుండాలని కోరుకుంటున్నాను అని వ్రాశాడు. 1 ^ 2 * 3 ^ 2 * 3 ^ 2 * 1 ^ 2 ఏమిటి అని అడిగాడు ఒక మిత్రుడు. 32 అంటే 3 * 3 = 9 అందుచేత 1991ని ఈ విధంగా గమ్మత్తుగా వ్రాశాడు అన్నాను నేను. అ... శుభాకాంక్షలలో కూడా లెక్కలేనా! అంటూ ఆశ్చర్యపడ్డాడు ఆ మిత్రుడు. లెక్కలలో తల దూర్చాలేకాని రకరకాల ఆలోచనలలో మనిషిని ముంచుతూ ఆలోచనా విధానానికి ఒక శిక్షణ ఇస్తూ వుంటుంది. ఈ తమాషా చూడండి!