
MEE ALOCHANALE MIMMALNI NIDDESISTAYI
₹299
In stock · 35 available
PublisherBARSA PUBLICATIONS
LanguageTelugu
ISBN9788199390126
Mee Alochanale Mimmalni Nirdeshisthai Personality development & Career Guidance Dr. Mohammad Hasena "ప్రవహిస్తున్న నదిలో స్నానం చేస్తే మీ ఒంటి మురికితో నది తాత్కాలికంగా మైలపడుతుంది. మీరు మాత్రం స్నానంతో శుద్ధమైపోతారు. కాని మైలపడిన నది మీరు వొదిలిన మురికిని ఒడ్డుకు నెట్టి తిరిగి పావనమై పోతుంది. ఇలా మీరు ఎన్నిసార్లు చేసినా అదే 'దృశ్యం' మీకు కనిపిస్తుంది. కాకపోతే ఓసారి పరిశీలించండి. మీ ఆలోచనలు కూడా ప్రవహించే నదిలాగే వుండాలి. మీ మెదడును తొలుస్తున్న సంఘర్షణలు, సమస్యలు ఏమైనావుంటే వాటి గురించి అదే పనిగా ఆలోచించి మీ మెదడును/మనస్సును కలుషితం చేసుకునే బదులు వాటిని పక్కకునెట్టి ప్రశాంతంగా గడిపే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ మనస్సు తేలికగా అనిపిస్తుంది”. “అవకాశం” అనేది వర్షం లాంటిది అది కురిసినప్పుడే మనం తడవాలి తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు. తరగతి గదిలోని నల్లబల్ల (బ్లాక్బోర్డు) ఏమి రాయనప్పుడు ఖాళీగా కనిపిస్తుంది. తెల్లటి సుద్దముక్కతో ఏది రాసినా అందంగా కనిపిస్తుంది. మీ మనసు కూడా ఏమి రాయని నల్లబల్ల వంటిదే. తరగతి గదిలోనే మీరు భవిష్యత్లో ఎలా ఉండాలనుకుంటున్నారో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రణాళికాబద్దంగా చదివి విజయం సాధించండి. అలా ఎదగడానికి ఈ పుస్తకం మీకు చక్కగా ఉపయోగపడుతుంది. బర్స్ పబ్లికేషన్స్ ISBN 978-81-993901-2-6 9788199390126