MEE ANDAM AROGYM PECHUKOVATAM YELA by SREE MADHULATHA PUBLICATIONS Telugu book cover

MEE ANDAM AROGYM PECHUKOVATAM YELA

by SREE MADHULATHA PUBLICATIONS

₹45
In stock · 16 available
PublisherSREE MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
ఆరోగ్యానికిహ్యాండ్ వాష్ చాలా చిన్నవయస్సు నుంచే అంటే మాటలు అర్థమయ్యేవయస్సు నుంచి అమ్మ చెబుతూనే ఉంటుంది... 'చేతులు శుభ్రంగా కడుక్కో' అంటూ... 'తినే ముందు కడుక్కోమంటారు. తిన్న తరువాత కడుక్కోమంటారు. వస్తువులను ముట్టుకున్నప్పుడు కడుక్కోమంటారు... ప్రతి సారీ ఇదే మాట' అంటూ చిన్నప్పుడు మనం చాలాసార్లు అమ్మమీద అలిగే ఉంటాం. అదంతా మన మంచికే అన్న విషయం అప్పుడు సరిగ్గా అర్థం కాకపోయినా చెప్పారు కదా అంటూ పాటించేస్తూ, దాన్ని ఓ అలవాటుగా చేసేసుకుంటాం. ఆ అలవాటునే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ పాటించడానికి ఓరోజును నిర్ణయించారు. అదే 'వరల్డ్ హ్యాండ్ వాషింగ్ డే'. ప్రతి సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన ఈ రోజున ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా చేతులను శుభ్రం చేసుకోవడం వల్ల కలిగే లాభాలూ, వాటిని ఎలా ? ఎప్పుడు కడుక్కోవాలి ? చేతులను ఎందుకు కడుక్కోవాలి ? సింక్ దగ్గర కేవలం కొన్ని సెకన్లు సమయాన్ని కేటాయించి చేతులను శుభ్రంగా కడుక్కోవడం వలన డాక్టర్ దగ్గరికి పదే పదే వెళ్ళడాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మన చేతులు క్రిములను తయారుచేసే కర్మాగారాలని వారు అంటున్నారు. కొన్ని వేల క్రిములు ప్రత్యేకించి చేతుల ద్వారానే మన శరీరంలోకి ప్రవేశిస్తాయన్న విషయాన్ని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదంటున్నారు. పదే పదే చేతులను శుభ్రం చేసుకోవడం వలన చేతుల్ని అందంగా వుంచుకోవడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవచ్చన్నది వారి వాదన. చేతులు శుభ్రంగా లేకపోతే హానికరమైన బాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించి స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా వున్నాయనివారు హెచ్చరిస్తున్నారు. మీ అందం... ఆరోగ్యం.. పెంచుకోవడం ఎలా?