
MEE INTLO PULI VUNDA
by AADIVISHNU
₹75
In stock · 311 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
డ్రామాకి జై కొట్టండి ! కథలూ నమలూ డ్రామాలూ ఎక్కువగానే రాసేను! ఎన్ని రానా... ఏమి రాసినా... నాకు డ్రామాల్లోనే ఎక్కువ తృప్తి లభించింది. డ్రామాలు ఎక్కువ కాలం బతుకుతాయి! ఎక్కువ సంఖ్యలో అభిమానులుంటారు! బహుశా... ৩০...! ఆ మాట కొస్తే- డ్రామా రాయడం అంత ఈజీ కాదు. ఈ కారణంగానే రచయిత్రులు డ్రామా జోలికి వెళ్లరు (కాబోలు)! ఒక చిన్న పోలిక మనవి చేస్తాను!" కథా నము మీటా కిళ్లలయితే డ్రామా మాత్రం 'జర్దా కిళీ అంటాను! మీటా కిళ్లలు చాక్ట్లు మాదిరి - చిన్నపిల్లల సైతం నమిలేస్తారు! జర్దాకిళ్లీ మీటా మాదిరి కసాలసా నముడానికి రూలు వప్పుకోదు. ఆ కిళ్లలో అంతో ఇంతో అనుభవం లేకపోతే - కక్కుకుంటారు. కట్లు తిరిగి పడిపోతారు. అంత కష్టం ఇష్టం లేక - రచయిత్రులు డ్రామాలకు దూరంగా వుంటున్నారని భావిస్తాను! వదిలేయండి ! కథా నము కంటె డ్రామాలే ఎక్కువ కాలం బతుకు తుంటాయి! నలభై ఏళ్ల క్రితం నేను రాసిన డ్రామాలు నేటిక్కూడా నిక్షేపంగా బతికున్నాయి! ఒక్కనేనేకాదు. నాకంటె సీనియర్లు - కీర్తిశేషులు ఆత్రేయ, నరసరాజు. పినిశెట్టి, అనిశెట్టి, భవిడపాటి లాటి ఎందరో ప్రముఖులు రాసిన డ్రామాలు చిరంజీవులై నేటికీ చెక్కు చెదరకుండా ప్రదర్శింపబడుతున్నాయి! డ్రామాల పవరు ఆ స్థాయితో వుంటుంది ! అంచేత డ్రామాకి జై కొట్టాలి! నేను ఆడీసీలో చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసరుగా వుంటో రివైరయ్యేను. ఆ సంస్థతో రామకృష్ణ నా కొలీగ్. ఇంజనీరు. నాకు మంచి స్నేహితుడు. చాలా మంచి నటుడు! మా సంస్థతో కళాకారులెక్కువ మంది ఉన్నారు.