
MEE KANTE GOPPAVARU LERU
₹30
In stock · 1 available
PublisherSRIKANTH KALASRI
LanguageTelugu
ముందుమాట పుస్తకాలు చదవడం అలవాటున్న చాలామందికి అలవాటు లేని విషయం ఈ ముందుమాట చదవడం. ఈ మాట పుస్తకం చెప్పే మాట. పుస్తకం మొత్తం గురించి రచయిత చెప్పే మాట. ఇది మీ ముందున్న ముందు మాట. "ఒక మంచి వ్యక్తితో స్నేహం చేయండి లేదా ఒక మంచి పుస్తకం చదవండి" అని మీ ఆలోచనను మంచిదారిలో ఉంచడానికి పెద్దలు చెప్పిన మంచిమాట. "ఒక మంచి పుస్తకంతో స్నేహం చేయండి" ఇది ఈ పుస్తకం చెప్పే మాట. మీరు స్నేహంగా ఈ పుస్తకాన్ని చదవండి. ఈ పుస్తకం మీతో స్నేహం చేస్తుంది. మీతో మాట్లాడుతుంది. మీ గురించి మీకు చెబుతుంది. మిమ్మల్ని మీకు కొత్తగా చూపిస్తుంది. ప్రతీ తల్లిదండ్రులు కోరుకునేది తమ పిల్లలు బాగుండాలని, వారి జీవితం సుఖసంతోషాలతో ఉండాలని. ప్రతీ ఒక్కరికి కష్టాలు సహజం. విద్యార్థిగా కష్టపడ్డా, వ్యక్తిగా కష్టపడ్డా గొప్పగా కష్టపడండి. గొప్పగా సాధించండి. మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకుంటే, మీ ఇష్టాన్ని గొప్పగా ఇష్టపడితే నిజంగా “మీకంటే గొప్పవారు లేరు". ఈ పుస్తకం చదివి మీ గొప్పను మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారని ఆశిస్తూ...