
MEE MOHAMMEEDHA SIRA
₹250
In stock · 160 available
PublisherS.GANAPATHI RAO
LanguageTelugu
ISBN9789361234378
ఆత్మగౌరవం ఏది?: సిరా కలమై, వర్షమై, వరదై అవినీతి గుండెల్ని ముంచడం కోసం పారాచూట్లో సైనికులు శత్రు శిబిరాల్లోకి మారణాయుధాలతో దిగినట్లు, బాధితులకు ఆహార పొట్లాలు హెలికాప్టర్ నుంచి జారవిడిచినట్లు - సిరా ట్యాంకర్లు ఆకాశం నుంచి నేలన పడి శతఘ్నులుగా పేలుతున్నాయి. ఓడల గిడ్డంగులకు చేరిన సిరా ట్యాంకర్లు పగిలి నగరంలోకి గట్లు తెగిన చెరువుల నుంచి వరద నీరు వచ్చినట్లు పడుతోంది. కత్తులు, డాలులు, శిరస్త్రాణాలు, కవచాలు, కోట గోడలు యుద్ధంలో రక్తసిక్తం అయినట్లు నగరం... సిరాసిక్తం అవుతోంది. కుండపోతగా ఆకాశం కురుస్తున్న వర్షం సి... రా...! ప్రజలు నెత్తిమీద నుంచి కారుతున్న సిరాతో తడిసి ముద్దయి ఊపిరాడక భీతావహం చెందుతూ 'వడగళ్ళ వాన చూసాం, చేపల వాన చూసాం, ఇదెక్కడి సిరా కురుస్తున్న వర్షం' అనుకున్నారు! రోడ్లు, వీధులు, కాలువలు, చెరువులు, గుంటలు, సెల్లారులు సిరామయం అయిపోయాయి. బంగాళాఖాతం. సిరాఖాతం అయిపోయింది. ఎస్. గణపతిరావు మీ మొహమ్మీద సిరా