MEERU KATHA VRAYALANUKUNTUNNARA by T.S.A.KRISHNAMURTHY Telugu book cover

MEERU KATHA VRAYALANUKUNTUNNARA

by T.S.A.KRISHNAMURTHY

₹60
In stock · 17 available
PublisherT.S.A.KRISHNAMURTHY
LanguageTelugu
మీరు కథ వ్రాయాలనుకుంటున్నారా? నేను 1968 ప్రాంతంలో వ్రాయడం మొదలు పెట్టినపుడు నాకు సాహితీవేత్తలూ, రచయితలూ ఎవరూ తెలియదు. అప్పట్లో నాకు తెలిసిన ఏకైక పద్యకవి డా॥ మల్లెల గురవయ్య గారు నా రచనలలోని అక్షరదోషాలను మాత్రమే సవరించి ఇచ్చేవారు. అందువల్ల ముందుకు సాగడానికి వెలుతురులో కోల్పోయిన దానిని చీకటిలో వెతుక్కుంటున్న వాడిలా చాలచాల ఇబ్బందులు పడ్డాను. ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు సాగడానికి గుర్తింపు పొందడానికి పాతిక సంవత్సరాలకాలం పట్టింది. అప్పట్లో... “T.S.A. కృష్ణమూర్తి సాహితీరంగంలో ఒంటరిగా చాలకాలం ఒంటిమడక సేద్యం చేశాడు" అనేవారు వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు. రచనలకు సంబంధించిన అనేక విషయాలు ఆకలింపు చేసుకోవడానికి, ప్రచురణలు ప్రచురణ కర్తలకు సంబంధించిన విషయాలు కొంతమేర ఆకలింపు చేసుకోవడానికి మరో పాతిక సంవత్సరాలు పట్టింది. అంటే నా అరవై ఏడేళ్ళ జీవితంలో పై విషయాలను అవగాహనకు తెచ్చుకోవడానికి దాదాపు ముప్పాతిక భాగం వెచ్చించాల్సి వచ్చింది. నేను సాధించిన విజయాలు, పొందిన గుర్తింపు వెనుక వున్న కఠోర పరిశ్రమ తాలూకు అనుభవాల సారాంశాన్ని ప్రారంభకులకు అందజేసి వారిమార్గం సుగమం చెయ్యడానికే నా ఈ ప్రయత్నం.. 'మీరు కథ వ్రాయాలనుకుంటున్నారా?.’