MEERU NENU ARTHIKAM by V.HANUMANTA RAO Telugu book cover

MEERU NENU ARTHIKAM

by V.HANUMANTA RAO

₹60
In stock · 14 available
PublisherV.HANUMANTA RAO
LanguageTelugu
నిజాయితీతో, ఏకదీక్షతో, ప్రజాపక్షపాతంతో వి. హనుమంతరావు పత్రికా రచనలో గడిపిన ఆరుపదుల ప్రజాజీవితం అనితరసాధ్యమైనది. ప్రభుత్వాలు చేసే ప్రతి పనినీ, ప్రతి ప్రకటననూ, విడుదల చేసే ప్రతి కాగితాన్ని, పుస్తకాన్నీ నిశితంగా పరిశీలించి, బాగోగులు చర్చించి ప్రజలకు తెలియజెప్పడం తన బాధ్యతగా గ్రహించిన అరుదయిన ప్రజామేధావుల సంప్రదాయంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలుస్తుంది. అకుంఠిత దీక్షతో, అహరహం శ్రమిస్తూ, వేలాది రచనలు చేసి, ప్రజానుకూల ప్రచారకులు ఎటవంటి కృషి చేయాల్సి ఉంటుందో తన జీవితమే ఉదాహరణగా చూపిన హనుమంతరావు అనుసరించదగిన ఆదర్శం. రాష్ట్ర, కేంద్ర, అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలపై వి. హనుమంతరావు రాసిన వేలాది వ్యాసాలలో నుంచి ఎంపిక చేసిన ఇటీవలి వ్యాసాల సంకలనం ఇది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, భూసంస్కరణలు, వాణిజ్య వ్యవసాయం, రైతుల ఆత్మహత్యలు, ఇంధన విధానం, రహదారులు, ద్రవ్యరంగం, వైద్య ఆరోగ్య రంగాలు, చేనేత, విద్యారంగం, అవినీతి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ప్రణాళికలు, బడ్జెట్లు, నిరుద్యోగం, పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు, ద్రవ్యోల్బణం, విదేశీ మారకనిల్వలు, విదేశీ పెట్టుబడులు, ఆర్థిక సంస్కరణలు, నిర్వాసితుల సమస్య, ప్రత్యేక ఆర్థిక మండలాలు, ప్రాంతీయ అసమానతలు, కమ్యూనిస్టు ఉద్యమం, విప్లవోద్యమం, మధ్యతరగతి... వంటి అనేక రంగాల మీద నిశితమైన, వివరమైన, గణాంక సహితమైన విశ్లేషణలు ఇవి.