MEERU SAMSKRUTHAM NERCHUKONDI by NISHTALA SUBRAHMANYASASTRY Telugu book cover

MEERU SAMSKRUTHAM NERCHUKONDI

by NISHTALA SUBRAHMANYASASTRY

₹200
In stock · 80 available
PublisherAMARAVATHI PUBLICATIONS
LanguageTelugu
మీరూ సంస్కృతం నేర్చుకోండి డా॥ శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్యం, పొన్నూరు సంస్కృతం అంటే ఏమిటి? భారతీయభాషల నెన్నింటినో సుసంపన్నములుగా నొనర్చినదీ భాష, దీనికే 'గైర్వాణి' యని మరియొక పేరు. గీర్వాణులనగా దేవతలు. వారి భాష గావున నిది గైర్వాణి అయినది. ఎవరిమాట అమోఘముగా పనిచేయునో వారు దేవతలు. వారి భాష గావుననే యిది దేవభాష, ఇట్టి ఘనత ప్రపంచమందలి భాషలలో సంస్కృతమునకు దక్కినది. సంస్కృతము దేవవాక్కు అని ఋషులు చెప్పిరి. భారతదేశమునకు సంస్కృత భాష, సంస్కృతి ప్రతిష్ఠను ఆపాదించుచున్నవని తెలియు చున్నది. సంస్కృత భాషను సంస్కరింపబడిన భాషయని కొందరందురు. అనగా ఇండో జర్మానిక్ భాషనుండి విడివడిన భాష మూల ప్రాకృత మనియు అది సంస్కరింపబడి సంస్కృతమైనదని వారి భావము. ఇట్టి సంస్కృతము నుండియే స్త్రీలకు సులభముగా నుండు శౌరసేని. పైశాచి, మాగధి మొ॥ ప్రాకృతభాష లేర్పడినవి. కొందరు ప్రాకృతము సంస్కృతమునకు మూలమనుట కుదరదనియు, సంస్కృతమే ప్రధమ గ్రంథమగు ఋగ్వేదమున గోచరించుచున్నదని చెప్పుదురు. సంస్కృతము పలుకుట కశక్యమై అపభ్రంశమై ప్రాకృతమైనదని వాక్యపదీయము అనుగ్రంథము చెప్పుచున్నది. భరతముని గూడ ఇట్లే చెప్పెను. ఈ వాదాలతో ప్రస్తుతం మనకు పనిలేదు. సంస్కృతభాషలో వేదములు, 18 పురాణాలు, శాస్త్రములు, వేదాంగములైన శిక్ష - వ్యాకరణము - ఛందస్సు - నిరుక్తము - జ్యోతిషము - కల్పము అనునవియు, షడ్దర్శనములనబడు - న్యాయ - వైశేషిక - సాంఖ్య - యోగ - పూర్వమీమాంస ఉత్తరమీమాంసలు, నాటకములు కావ్యములైన రఘువంశము మొదలైనవి అనేక గ్రంథములు గలవు. ప్రపంచంలో మొట్టమొదటి గ్రంథములు వేదములు. అవి సంస్కృతములోనే గలవు. డా॥ నిష్ఠల సుబ్రహ్మణ్యశాస్త్రి * 1