MEESALA PI (LLA) LLI by S. VIVEKANDA Telugu book cover

MEESALA PI (LLA) LLI

by S. VIVEKANDA

₹150
In stock · 15 available
PublisherVASUNDHARA PUBLICATIONS
LanguageTelugu
చీట్లు - పాట్లు సుబ్బమ్మగారంటే కేదారేశ్వరపేట అబ్బా అనాలి! అదీ.. ఆమె తెలివి తేటల దెబ్బంటే! ఆమేం పెద్దగా చదుకున్నది కాదు. ఏదో వానాకాలం చదవు! మనిషి పొడగరి! దృఢంగా ఆరోగ్యంగా ఉంటుంది. పాతిక కిలోల బస్తా అవలీలగా భుజాన వేసుకుని ఇల్లు చేరుకోగల శక్తిమంతురాలు! విజయవాడ సిటీలో కేదారేశ్వరపేటంటే... నలభై ఏళ్ల క్రితం అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా కిద లెఖ్త! అక్కడ ప్లాట్లు అమ్మకం జరిగినా ఎవ్వరూ మొదట్లో ఇళ్లు కట్టుకొను సాహసించలేదు. కాకుంటే... కూతవేటు దూరంలో సిమెంట్ ఫ్యాక్టరీ వుంది కాబట్టి వచ్చిపోయే వాహనాలతో రద్దీ వుండే ప్రాతం కదా అని ఒకరిద్దరు ఇళు కట్టుకున్నారు. ఆ కాలనీలో మూడో ఇల్లే సుబ్బమ్మది. అలా ఏడాది కాలంలో ఇళ్లు పెరిగాయి. కాలనీలో సందడి ఎక్కువైంది. దూరాలోచనలో ఉన్న సుబ్బమ్మ కాలనీ వాసుల కోసం చిల్లర కొట్టు పెట్టింది. అడిగిన వారికి అప్పులిస్తూ ఆత్మీయతను పదిమందికి పంచింది. ఆరు నెలలు తిరగకుండానే పిండి ఆడించే మిషన్... గ్రైండర్ కొని వ్యాపారాన్ని వృద్ధి చేయటానికి పునాదులు వేసింది. సుబ్బమ్మ భర్త మనిషి మేధకుడు! ఇంట్లో ఫిమేల్ డామినేషన్! భర్త వాయిస్ లెస్ కావటానికి కారణం... పెత్తనం సుబ్బమ్మదే! భర్త రామనాథం అమోగ్యుడు కాకపోయినా సిమెంట్ డీలర్ దగ్గర ఉద్యోగం చేస్తూ నెలకు నాలుగు వేలు ఆర్జిస్తుంటాడు. సుబ్బమ్మ వాగోరణి, మాటల చాకచక్యాలకు ఎలాంటి వారైనా బుట్టలో పడిపోవాల్సిందే. ఆమె మాటల మేధావి! మరో నాలుగేళ్లు గడిచేసరికి కాలనీలో నాలుగు వందల ఇళ్లు పెరిగాయి. అక్కడక్కడ శ్రమజీవుల గుడిసెలు వెలిశాయి! కాలనీవాసులందరికీ సుబ్బమ్మే రింగ్డర్! మాట సహాయం కోసం, అప్పుకోసం ఇతర ప్లాన్ల కోసం సుబ్బమ్మను ఆశ్రయించి ఆమె చెప్పినట్టే నడుస్తారు వారంతా! ఆమె మాట కాలనీవాసులందరికీ వేదవాక్కు. మునిసిపల్ ఎన్నికల్లో ఆమె కాలనీలో నిలబడితే కౌన్సిలర్ ఏకగ్రీవంగా ఎన్నిక అవడం ఖాయం! సుబ్బమ్మ