
MEGASTAR THE LEGEND
₹750
In stock · 9 available
PublisherJAYA PUBLICATIONS
LanguageTelugu
కలం బలం ఎప్పుడూ గొప్పదే... మీ మె: గాస్టార్ ది లెజండ్ - ఈ పేరుతో పుస్తకం రాస్తున్నానని వినాయకరావు అన్నప్పుడు నాకు అనిపించింది ఒక్కటే... కృషి, పట్టుదల ఉంటే ఎవరు ఏ రంగంలోనైనా లెజండ్ కావచ్చు. ఇంతకుముందు నటరత్న నందమూరి తారకరామారావు గారు, కృష్ణ గారు, దాసరి నారాయణరావు గార్లపై ఆయన రాసిన పుస్తకాలు నేను చదివాను. నేను మద్రాసులో ఉండి సినిమాలు చేస్తున్నప్పుడు 'సితార' హైదరాబాద్ రిపోర్టర్గా వినాయకరావు గురించి నాకు తెలుసు. 'స్టేట్ రౌడీ' సినిమా షూటింగ్ కోసమనుకుంటాను హైదరాబాద్ వచ్చినపుడు మొదటిసారిగా వినాయకరావు నన్ను కలిసి ఇంటర్వ్యూ తీసుకున్నట్లు గుర్తు. పత్రికల్లో రాయడమంటే అదో అక్షర యజ్ఞం. క్షరం కానిది అక్షరం. నశించని గుణం దానికి ఉంది కాబట్టే దానికంత బలం. అలాంటి అక్షరాలతో మాకు అండగా నిలిచేది జర్నలిస్టులే. అందుకే నాకు మొదటి నుంచీ పాత్రికేయులంటే గౌరవం. వినాయకరావులో నాకు కనిపించిన ప్రత్యేకత ఆయన వినయం... కానీ విమర్శ చేయాల్సి వచ్చినపుడు ఆయన రాతల్లో ఆ వినయం కనిపించదు. తాను చెప్పదలచుకున్నది సూటిగా స్పష్టంగా చెబుతారు. ఆయన రాతల వల్ల నేను నొచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. మెచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. 'గ్యాంగ్ లీడర్' సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అనుకుంటాను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి 'మీ గురించి పుస్తకం రాయాలనుకుంటున్నాను... మీకేమైనా అభ్యంతరమా అన్నారు. ఆ తర్వాత మరికొన్నాళ్లకు అన్నపూర్ణ స్టూడియోలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కు హోస్ట్గా చేస్తున్నపుడు ఏకంగా 200 పేజీల పుస్తకంతో వచ్చారు. అది చూడగానే నాకే ఆశ్చర్యం వేసింది. నా గురించి నేను మరచిపోయిన విషయాలే అందులో అనేకం ఉన్నాయి. అమూల్యమైన ఫొటోలు ఎన్నో ఉన్నాయి. దాదాపు మూడేళ్లు తను నా పుస్తకం కోసం శ్రమించడం చూసి చాలా ఆనందం వేసింది. నటన మొదలుకొని రాజకీయాల వరకూ ఏ అంశాన్నీ వదలలేదు ఇందులో. నిజంగా ఇది నా గురించి కంప్లీట్ పుస్తకమే అని చెప్పాలి. ఇంతవరకూ ఎవరూ చేయని ప్రయత్నమిది. ఈ బయోపిక్ల కాలంలో ఇలాంటి పుస్తకాల అవసరం చాలా ఉంది. నన్ను మెగాస్టార్ అని అందరూ అంటూ ఉంటారు... నిజానికి అందులోని 'మెగా' అనే పదం కన్నా నా పేరులోని 'చిరు' శబ్దం అంటేనే నాకిష్టం. అలాంటి చిరంజీవత్వం నాకు లభించడం ఓ వరం... కలం బలం ఎప్పుడూ గొప్పదే. థ్యాంక్యూ....