
MELIMI BANGARAM - BALALA KATHALU
by B.V.PATNAIK
₹100
In stock · 950 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789348126009
Melimi Bangaram (Stories for Children) By B.V. PATNAYAK మూడు పుష్కరాలు దాటి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్న శ్రీ బి.వి. పట్నాయక్ పిల్లల మనసెరిగి కథలు రాస్తున్న రచయిత! 'మేలిమి బంగారం' పుస్తకంలో కథలు అందరూ ఇష్టపడే కథలు. ‘పిండివంటల్లో తీపి ఏది?' తెలుసుకోడానికి పిల్లలు ఒకవైపు తొందరపడితే, 'తొండ సాక్ష్యం!' ఎలా ఉంటుందో తెలుసుకోడానికి మరోవైపు పిల్లలు ఉత్సుకత చూపుతారు. 'ఎలుగుబంటి సలహా!' కథలో ఎలుగుబంటి ఎటువంటి సలహా ఇచ్చిందో తెలుసుకోడానికి పిల్లలు ఇంకొకవైపు ఉవ్విళ్ళూరుతారు. చిక్కు లెక్కలు తెలిసిన పిల్లల మధ్య 'ఈశ్వరయ్య తెలివి' ఎలా పనిచేసిందో తెలుసుకోడానికి పిల్లలు ఆసక్తి చూపుతారు. 'మేలిమి బంగారం'గా మెరిసిన బాలిక విజయగాథ పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. ఈ పుస్తకంలో ఉన్న 35 కథలు పిల్లల్లో ఆలోచనాశక్తిని రేకెత్తించే విధంగా రాయబడ్డాయి. ప్రస్తుతం పాఠశాల సహాయకుడు (గణితం)గా పనిచేస్తున్న శ్రీ బి.వి. పట్నాయక్ కొసమెరుపు కథలు రాస్తారన్న నిజం ఈ పుస్తకం తేటతెల్లం చేస్తుంది. బాలబాలికల్లో పఠనాశక్తి పెంపొందించే దిశగా శ్రీ బి.వి. పట్నాయక్ రచించిన 'మేలిమి బంగారం' బాలల కథా సంపుటి పిల్లలకు చక్కని కానుక. పిల్లలకు బాలసాహిత్య ప్రయోజనాలు అందించే అపురూప కథామాలిక. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN 978-93-48126-00-9