MILLION DOLLAR COMPANY KI SPOORTHY ANU AUNTY-225 by REEM PUBLICATIONS Telugu book cover

MILLION DOLLAR COMPANY KI SPOORTHY ANU AUNTY-225

by REEM PUBLICATIONS

₹225
In stock · 13 available
PublisherREEM PUBLICATIONS
LanguageTelugu
ISBN9788183513005
'వీడు చెత్త కోసం రాయలేడు' ప్రారంభించే ముందు నేను మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను వ్యాపారవేత్తగా అవతరించడానికి దారితీసిన యధార్థగాధను ఈ పుస్తకం వివరిస్తుంది. నా వ్యక్తిగత జీవితంలోని కొన్ని అంశాలు కొంతమేర అతిశయోక్తులుగా అనిపించవచ్చు. అయినప్పటికీ ఇది నాకు సంబంధించిన కథ. అందువల్ల దీనిని స్వీకరించడం లేదా తిరస్కరించడం అన్నది మీ ఇష్టం. నా స్నేహితుడు రోహన్ మల్హోత్రాతో కలసి నేను సొంతంగా కంపెనీని ప్రారంభించడానికి చేసే ప్రయత్నంలో ఎదురైన అనుభవాలు ఈ పుస్తకంలో ప్రస్తావించబడ్డాయి. నేను రచయితను కాదన్న విషయం నాతో సన్నిహితంగా ఉండే వారందరికీ తెలుసు. అయితే, ఈ పుస్తకం వ్రాసే సమయంలో, నాలో దాగి ఉన్న హెమింగ్వేను మాత్రం తట్టి లేపడానికి నా శక్తి మేరకు ప్రయత్నించాను. కాని అసలు సమస్య అక్కడే ఉంది. ఎందుకంటే నా అంతరాంతరాలలో హిమింగ్వే లాంటి రచయిత లేడు కాబట్టి! అందువల్ల దయచేసి ఈ పుస్తకం చదవకండి. లేకపోతే 'ఎంతూ కట్లెట్' మాదిరిగా మీరు పరుగులు తీస్తూ మీ స్నేహితులతో చెబుతారు: 'ఒరేయ్, నేను ఈ పుస్తకాన్ని చదివాను: కధ బాగానే ఉంది. అయినా వీడు చెత్తకోసం రాయలేడు.' ఈ విషయం నాకు తెలుసు లేరా! ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు ఇంగ్లీష్ పాఠాలు చెప్పిన అధ్యాపకుడు బహుశా గుండెలు బాదుకోవచ్చు. నేను కథలు చెప్పేవాడిని మాత్రమేగాని రచయితను కాదు. అందువల్ల ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు.