
MIMMALNI MEERU TELUSUKONDI
₹349
In stock · 35 available
PublisherBARSA PUBLICATIONS
LanguageTelugu
ISBN9789361231742
MIMMALNI MEERU TELUSUKONDI Dr. MOHAMMAD HASEΝΑ మీ జీవితాన్ని మార్చే ఒకే ఒక పుస్తకం నీరు నిల్వ ఉంటే పాచిపడుతుంది. అవి త్రాగడం ఆరోగ్యానికి హానికరం. ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉంటుంది. వాటిని త్రాగటం శ్రేయస్కరం. జీవితం కూడా అంతే ఉన్నచోటనే ఉంటే మనస్సులో / మెదడులో మొద్దుబారిన ఆలోచనలు వస్తాయి. ప్రవాహం మాదిరిగా మీ మనస్సును ఉంచుకుంటే వైవిధ్యమైన ఆలోచనలకు మీ మెదడు కేంద్ర బిందువు అవుతుంది. ఒక చెట్టుతో లక్ష అగ్గి పుల్లల్ని తయారు చేయవచ్చు. కానీ ఒకే ఒక అగ్గిపుల్ల అడవి మొత్తాన్ని దహించి వేస్తుంది. సూత్రం చిన్నదే. ఒకే ఒక్క "ప్రతికూల ఆలోచన" (Negative Thought) మీ వేయి సానుకూల ఆలోచనలను దహించి వేయగలదు. అందుకే నెగిటివిటికి దూరంగా ఉండండి. సానుకూల వ్యక్తిత్వం ఉన్న వారితో ఉండండి. బురదలో ఉన్నప్పటికి కమలం పవిత్రమైనదే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికి తేనె అమృతమే. మీరు ఉన్న ప్రాంతం అలాగే మీ చుట్టూ ఉన్న వారిని బట్టి ఎవ్వరిని ఆంచనా వేయకండి. దేనినైన పొందటం గెలుపుకాదు, అలాగే దేనినైనా కోల్పోవటం ఓటమికాదు. ఇదంతా కాలంతోపాటు జరిగే మహిమ మాత్రమే. పరివర్తన అన్నది కాల స్వభావం, మనిషి ఏదైనా కోల్పోయినప్పటికి శాంతంగా, స్థిరంగా ఉంటే అది కూడా ఓ గెలుపే అవుతుంది. ఈ రోజు నీ సమయం కాకపోతే నీకంటూ ఓ సమయాన్ని కాల చక్రమే స్వయంగా నీ ముంగిట ఉంచుతుంది. బర్స్ పబ్లికేషన్స్ Navodaya, Book ISBN 978-93-6323-374-2 9789361 231742