
MIND POWER -100
₹100
In stock · 5 available
PublisherSAIBABA PUBLICATIONS
LanguageTelugu
నుండే వర్... ఆదెళ్ళ శివకుమార్ ప్రతి మనిషికీ మెదడు వుంటుంది. మెదడులేని మనిషి అంటూ ఎవరూ వుండరు. అదే విధంగా మీకు కూడా మెదడు వుంది. అయితే మీ మెదడు శక్తి"ని ఏ విధంగా ఉపయోగించు కుంటున్నారన్న విషయం మీదే మీ 'సక్సెస్' ఆధారపడి వుంటుంది. మీ మెదడు అనేది రెండు స్థాయిల్లో పని చేస్తూ వుంటుంది. ఒకటి 'కాన్షస్ మైండ్' అంటే చైతన్య వంతంగా వుండే మెదడు. రెండు 'సబ్ కాన్షస్ మైండ్' అంటే చైతన్య రహితంగా, జడత్వంతో వుండే మెదడు. మీరు మీ 'కాన్షస్ మైండ్' ద్వారా ఆలోచిస్తారు. అయితేమీరు స్వతహాగా చేసే ఆలోచనలు అన్నీ కూడా 'సబ్ కాన్షస్ మైండ్'లో లోతుగా స్టోర్ అవుతాయి. సబ్ కాన్షస్ మైండ్ అనే దాన్ని మీ ఆలోచనల గోడవున్గాగా చెప్పుకోవచ్చు. మీ క్రియేటివ్ ఆలోచనలకు, భావోద్వేగాలకు మీ 'సబ్ 'కాన్షస్ మైండ్' మూలస్థానంగా చెప్పుకోవచ్చు. మీరు మంచిగా, పాజిటివ్గా ఆలోచిస్తే మంచే జరుగుతుంది. అదే చెడ్డగా, నెగెటివ్గా ఆలోచిస్తే అంతా నెగెటివ్గానే జరుగుతుంది. కాబట్టి ఇప్పటికయినా మీ మెదడు ఏ విధంగా పని చేస్తుందో మీకు అర్థమై వుంటుంది. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాల్సి వుంది. అదేమిటంటే ఒక్కసారి మీ 'సబ్ కాన్షస్ మైండ్' ఒక ఆలోచన లేదా ఐడియాను అంగీకరించి స్టోర్ చేసి పెట్టుకుందంటే ఇక ఆ ఆలోచన లేదా ఐడియాను కార్యరూపం లోనికి తెచ్చేందుకు ప్రయత్నిస్తూ వుంటుంది. ఇక్కడ మరోముఖ్యవిషయం ఏమిటంటే 'సబ్కాన్షస్ మైండ్' తను స్టోర్ చేసుకునే మంచి ఆలోచనలు లేదా చెడ్డ ఆలోచనల పట్ల ఒకే విధంగా స్పందిస్తుంది. అంటే సబ్కాన్షస్ మైండ్కు "ఇది మంచిది”, “ఇది చెడ్డది" అనే రాగద్వేషాలు వుండవన్నమాట. MIND POWER