MISIMI MASA PATRIKA JULY 2022 by KALAJYOTI PROCESS PVT LTD Telugu book cover

MISIMI MASA PATRIKA JULY 2022

by KALAJYOTI PROCESS PVT LTD

₹50
In stock · 7 available
PublisherKALAJYOTI PROCESS PVT LTD
LanguageTelugu
| ఉత్తరాలు | మిసిమి కమ్మతెమ్మెరలు ఈ క్రింది వాక్యాలు గత నెల (మిసిమి మే-2022 సంచిక)లో మీ సంపాదకీయం చదవగానే నాలో పెల్లుబికిన భావాలు, కానీ పంపడానికి సంకోచించాను, మరీ తీవ్రంగా ఉన్నాయేమోనని. మిసిమి జూన్ మిసిమి 2022 సంచికలో అంతమంది మహామహుల స్పందన చూశాక నా ఆలోచనలని కూడా మీతో పంచుకోవాలనిపించింది. ఆలోచించే ప్రతి మనిషి ప్రస్తుత కాలంలో పడుతున్న ఆవేదన, వెలిబుచ్చలేని ఆక్రోశం, ఏమీ చెయ్యలేని నిస్సహాయత - వీటన్నిటినీ చాలా చక్కగా విశ్లేషించారు అశ్వినీకుమార్ గారు. నా దృష్టిలో మనందరిలోనూ నిక్షిప్తంగా ఉన్న రాక్షసత్వం, పైశాచికత్వం ఇప్పుడు బయట పడుతున్నాయనుకుంటాను. ఈ స్వార్ధం, ఈ ఉదాసీనత, ఈ సంవేదనారాహిత్యం, ఈ అసహనం, ఈ అమానుషత్వం ఇంతకు ముందు మనం చూడనివి. తలచుకుంటేనే మనసు వికలమై మన మీదే మనకి కోపం ప్రజ్వరిల్లే పరిస్థితి. ఈ దుర్భర, దుస్సహ పరిస్థితి నుండి మనకి విముక్తి ?.." - సత్యనారాయణ, తెనాలి మిసిమి మే-2022 సంచికలో మునిపత్రం విశ్వామిత్రుని శాపమంత తీవ్రంగా ఉన్నది. నగ్నముని బడబాగ్ని అది. ఈ వ్యవస్థ మీద ఏనాడో విప్లవ శంఖం పూరించినవారు నగ్నముని. మీ సంపాదకీయంతో పాటు నగ్నముని పత్రం కూడా ప్రజలకు ఓ హెచ్చరికలా పంపాల్సిందే. డా. నిమ్మగడ్డ శేషగిరిరావుగారు ప్రపంచమంతా పర్యటిస్తూ ఆయా దేశాల చరిత్ర, యుద్దాలు, ప్రాచీన కట్టడాలు, ఆచార సంప్రదాయాలు, రుచులు, అభిరుచులు కూడా వివరిస్తూ మనందరినీ నోరూరింపజేస్తున్నారు. డా. నిమ్మగడ్డ శేషగిరిరావుగారూ జయోస్తు! డా. కూరెళ్ల విఠలాచార్య గారి కృషి గురించి (జూన్ 22, మిసిమి) చదివి ముగ్ధుడనయ్యాను. వారు గొలుసుకట్టు నవల ల గురించి పరిశోధన చేస్తున్న సందర్భంలో మహనీయులు నీలం రాజు వెంకట శేషయ్యగారి సారథ్యంలో నడుస్తున్న నవోదయ మాసపత్రికలో గొలుసుకట్టు నవలను అప్పటికే బైండ్ చేసి ఉంచిన నవోదయ సంచికలను వారికందించాను. మా గ్రామం వచ్చారు. వారి పరిచయం నాకొక గొప్ప జ్ఞాపకం. నవోదయలోనే శ్రీపాదవారి అనుభవాలు జ్ఞాపకాలు వచ్చాయి. 'నాలోని నాదాలు' విజయలక్ష్మి గారి వ్యాసం బాగున్నది. అసలు కుందుర్తి పద్యకవి. విశ్వనాథవారి అనుచరులు. 'వచన పద్యాలనే దుడ్డు కర్రతో పద్యాల నడుముల్ విరగదంతాన్' అనిన పఠాభి ప్రభావంతో నరసరావుపేట నుండి 'నయాగరా' కవులుగా కుందుర్తి - అనిసెట్టి- బెల్లంకొండ వంటివారు వచన పద్య రచనా కవులుగా ప్రశస్తి పొందారు. కుందుర్తి గారి 'నగరంలో వాన' మంచి కావ్యం. వచన కవిత్వానికి ఆద్యుడు శ్రీశ్రీ. ప్రభవ పద్యకావ్యంలో నన్నయవలె సంస్కృత పదాల సమాసాలతో పద్యం కవిత్వం చెప్పిన శ్రీశ్రీ శ్రీశ్రీ కవిత్వ ప్రభావంతో లక్షల గొంతుకలు స్పందించాయి. కుందుర్తి పద్య కవిత్వంలో దిట్ట ఆనాటి ప్రభావంలో పడి వచన పద్య నిర్మాతల్లో ప్రముఖ స్థానం సాధించారు. ఆరుద్ర - తిలక్ నారాయణబాబు సోమసుందర్ వంటి కవుల సరసన నిలబడిన కవి కుందుర్తి. ఎడిటర్స్ డైరీ ఆత్మీయంగా ఉంది. ఆనందంగా ఉంది. కొనసాగించండి..." -చెరుకువాడ వెంకట్రామయ్య, విస్సాకోడేరు, భీమవరం మిసిమి జూన్ 2022 సంచికలో మునిపత్రము ద్వారా నగ్నముని గారి అంతరంగ ఆవేదన సమాజంలో చైతన్యవంతులు, దేశ ప్రేమికుల ఆలోచనలకు, అభిప్రాయాలకు అద్దంపట్టింది. మన దేశంలో జరుగుతున్న, నడుస్తున్న కుళ్లును, అక్రమాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. మరి దీనికి విరుగుడు ఏమిటి? అనేదే