
MODI JAGANNATAKAM
₹10
In stock · 1852 available
PublisherCPI PUBLICATIONS
LanguageTelugu
బీజేపీని ఓడించి.. దేశాన్ని రక్షించాలి ໖. సీపీఐ ప్రధాన కార్యదర్శి లోక్సభకు జరగనున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించి దేశాన్ని పరిరక్షించాలన్న నినాదంతో 2023 ఏప్రిల్ 14 నుంచి మే 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించాలని సీపీఐ జాతీయ సమితి నిర్ణయించింది. 1925లో పార్టీని స్థాపించిన నాటి నుంచి ప్రజల జీవనం మెరుగుపరిచేందుకు జరిగిన ప్రజా పోరాటాల్లో సీపీఐ అగ్రభాగాన నిలిచింది. ప్రజల కోసం, దేశం కోసం త్యాగాలు చేయడంలో సీపీఐ అగ్రస్థానంలో వుంది. ప్రజాపోరాటాల్లో పార్టీది ఘనచరిత్ర. సమాజంలో దోపిడీకి గురవుతున్న వర్గాలకు వాణిగా సీపీఐ పనిచేస్తోంది. సానుకూలంగా జాతీయ అజెండాను రూపొందించడంలో గణనీయమైన పాత్ర నిర్వహించింది. మనం చేసిన పోరాటాలు అన్ని వర్గాలకు ప్రయోజనకరమైన ప్రధానమైన విజయాలను సాధించింది. కష్టజీవులైన కార్మికుల, రైతుల హక్కుల కోసం సీపీఐ చేసిన కృషి, పోరాటం మరవలేనిది. ప్రజలు, సమాజం కోసం అత్యున్నత త్యాగాలు చేసి రక్తం ధారపోసిన అమరవీరుల స్ఫూర్తి వాస్తవంగా చాలా గొప్పది. నేటి కాలంలో మనం మునుపెన్నడూ లేని అసాధారణ రాజకీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకమైంది. కేంద్రంలో, చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవారు విచ్ఛిన్నకరమైన ఆర్ఎస్ఎస్ అజెండాతో పనిచేస్తున్నారు. మన స్వాతంత్ర్య ఉద్యమ లక్ష్యాలన్నింటినీ ఆర్ఎస్ఎస్ భావజాలం ధ్వంసం చేస్తోంది. మోడీ జగన్నాటకం