MODI NEETI - ANDHRAPRADESH BHAVISHYATTU by T.LAKSHMINARAYANA Telugu book cover

MODI NEETI - ANDHRAPRADESH BHAVISHYATTU

by T.LAKSHMINARAYANA

₹40
In stock · 624 available
PublisherT.LAKSHMINARAYANA
LanguageTelugu
మోడీ“నీతి” ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు? టి. లక్ష్మీనారాయణ జన్మస్థలం : కె. కందులవారిపల్లి, చిట్వేల్ (మ), కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. విద్య: బి.కామ్., ఎస్.వి.ఆర్ట్స్ కాలేజీ, ఎం.ఏ., ఎస్.వి. యూనివర్సిటీ, తిరుపతి. 1972లో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్లో చేరి, రాష్ట్ర కార్యదర్శి (1981-85) గా, జాతీయ ప్రధాన కార్యదర్శి (1985-91) గా, 1972లో సిపిఐలో చేరి 1981లో రాష్ట్ర సమితి సభ్యుడుగా, 1986లో జాతీయ సమితికి ఆహ్వానితుడుగా, కడప జిల్లా కార్యదర్శిగా (1991-95), 1995 నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు (2004-07)గా, ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర కార్యదర్శిగా, కార్యనిర్వాహక అధ్యక్షులుగా, విశాలాంధ్ర విజ్ఞాన సమితి కార్యదర్శి (2005-09)గా, నీలం రాజశేఖరరెడ్డి పరిశోధన కేంద్రం, డైరెక్టర్ (రెండేళ్లు)గా బాధ్యతలు నిర్వహించారు. సోవియట్ యూనియన్, చైనా, క్యూబా, జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, చెకోస్లోవేకియా, పోలాండ్, బల్గేరియా, హంగరీ, డిపిఆర్ కొరియా, మంగోలియా, సైప్రస్, ఆఫ్ఘనిస్తాన్, థాయిలాండ్, పాకిస్తాన్, యు.కె., ఐర్లండ్ దేశాలలో పర్యటించి, అనేక జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ మహాసభలు, విద్యార్థి యువజనోత్సవాలలో పాల్గొన్నారు. ప్రధాన తెలుగు దినపత్రికలు, పలు మాసపత్రికల్లో సమకాలీన సమస్యలపై అనేక వ్యాసాలు వ్రాశారు, టీవీ చర్చల్లో పాల్గొన్నారు. ఏ.ఐ.ఎస్.ఎఫ్. మాసపత్రికలు మిలిటెంట్ (తెలుగు), స్టూడెంట్స్ యాక్షన్లకు సంపాదకులు, ప్రచురణకర్తగా బాధ్యతలు నిర్వహించారు. ఏ.ఐ.ఎస్.ఎఫ్. ఉజ్వల ఘట్టాలు, కడప జిల్లా సమాచార దర్శిని, కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ స్మృతులు "అరుణోదయం" తదితర పుస్తకాల ప్రచురణలో ముఖ్య భూమిక పోషించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రచరిత్ర - సంస్కృతి-7వ సంపుటికి 1956కు పూర్వం తెలుగునాట విద్యార్థి, కార్మిక, కమ్యూనిస్టు ఉద్యమాలకు సంబంధించి ఐదు అధ్యాయాలు వ్రాశారు.