
MODUGUPOOLU
₹110
In stock · 10 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
డా॥ దాశరథి రంగాచార్య సాహిత్యం తెలంగాణా జనజీవనం, నిజాంపాలన నాటి తదనంతర రైతాంగ పోరాటం, నాటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాల నేపథ్యంలో దాశరథి రంగాచార్య రూపు కట్టించినట్టు మరే రచయిత చిత్రించలేదన్నది సత్యం. చారిత్రకంగా జరిగిన సామాజిక పరిణామ దశల్లో జన శ్రేణులు ఎలా స్పందించిందీ, తమ సాంస్కృతిక స్వేచ్ఛ కోసం ఎలా నిరసన తెల్పిందీ, రాజకీయ అస్తిత్వం కోసం ఎలా ఆందోళన, తిరుగుబాటు, ప్రతిఘటనలు చేసిందీ చివరకు భూమి కోసం, భుక్తి కోసం, భాష కోసం, వెట్టి చాకిరి అంతం కోసం, నిజాం పాలనను తుదముట్టించటం కోసం ఎలా సంఘటించి పోరాడిందీ దాశరథి రంగాచార్య రచనలు నేటి తరానికి కళ్ళ ముందు కదలాడేలా చేస్తాయి. చిల్లర దేవుళ్ళు, మాయజలతారు, మోదుగుపూలు, జనపదం అన్న సత్యాన్ని వంటి నవలలు చరిత్ర నిర్మాతలు జనం వెల్లడిస్తాయి. జనం భాషలో గుండెలను పలకరిస్తూ, మెదళ్ళను పదునుబెడ్తాయి. వీరి రచనలు అనేకం ఇతర భారతీయ భాషల్లోకి వెళ్ళాయి. చలన చిత్రాలుగా కూడా వచ్చాయి. సంప్రదాయం పునాదుల మీద ఆకాశమంత ఎత్తుగా ఎదిగిన అభ్యుదయ సారస్వత గోపురం దాశరథి రంగాచార్య సాహిత్యం.