MOLAKALA PUNNAMI-50 by DR.VEMPALLI GANGADHAR Telugu book cover

MOLAKALA PUNNAMI-50

by DR.VEMPALLI GANGADHAR

₹50
In stock · 4 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మట్టి పరిమళాలు ఈ కథలు “మానవ జీవితం ఒక మహాభారతం. అన్ని జీవితాల్లోనూ వుంటాయి అరణ్యవాసము అజ్ఞాతవాసము ఆ తర్వాత యుద్ధము. అరణ్యవాసము అజ్ఞాతవాసాలు కూడా యుద్ధానికి రూపాంతరాలు. తీవ్ర తీవ్రతర తీవ్రతమ యుద్ధాలు ఆ మూడు దశలు. ఇలా జీవితమంతా ఏదో ఒకవిధంగా, మనిషి జీవించడానికి జరిపే పోరాటమే' అని నా 'ఆధునిక మహా భారతం' అవతారికలో రాశాను. అలాంటి పోరాటం ఈ కథల్లో కన్పిస్తుంది. సమకాలీన సమాజానికి అద్దం పట్టే వీటితో నేను ఏకీభవిస్తాను. సమాజాన్ని మరమ్మతు చేయగల శక్తి ఈ కథలకుంది. ఒక్కోకథ ఒక్కో మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తుంది. పల్లెకు వెళ్ళి ఆత్మీయుల మధ్య గడిపి, గట్లదారెంబడి నడుస్తూ, పాలబాటలో దిగి దోసిళ్ళతో నక్షత్రాలు ముంచుకుని ముఖం కడుక్కుని తామర పూల తోటల్లో తారట్లాడుతున్న ఉదయకిరణాల్లా వున్నాయి. సాధారణంగా దృశ్యం స్వరూపాన్నే చూపిస్తుంది. దాని రంగు రుచి వాసన చూపించజాలదు. కానీ ఈ కథల్లో మానసిక జ్వాలలు మండు చుండగా వర్తమాన భారత రాజకీయ స్వరూపం కూడా కన్పిస్తుంది. మనదేశపు రాజకీయ దుర్భర దుర్గంధము, కన్నీళ్ళు తెప్పించే పీడిత వర్గాల దుస్థితి, పీడకుల అనిర్వచనీయమైన ఘోర దుర్మార్గాలు అన్నీ ఘప్పున పాఠకుల్ని ముట్టడిస్తాయి. పాఠకుడిలో క్రోధను, తిరుగుబాటు, పీడక వర్గ సంహార వాంఛ ఇంకా అలాంటి ఎన్నో భయానక వాంఛలు దావానలంగా విజృంభిస్తాయి. అంటే