MOSAM PILLALA KATHALU BOMMALATHO - 60 by PUPPALA KRUSHNAMURTHY Telugu book cover

MOSAM PILLALA KATHALU BOMMALATHO - 60

by PUPPALA KRUSHNAMURTHY

₹60
In stock · 590 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఆస్తి నాస్తి కృష్ణానది రేవుకు వెళ్లేదారిలో పండు ముసలమ్మ కూర్చుని 'అయ్యా! ధర్మం చేయండి బాబూ. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు' అని అడుక్కోసాగింది. నది దాటేందుకు వెళుతున్న ఆస్తిగుప్తుడనే వ్యాపారిని కూడా అడిగిందామె. దానికాయన 'ఈ సృష్టి, స్థితి, లయ కారకుడైన భగవంతుడు సృష్టిలోని యిన్ని కోట్ల ప్రాణులకు ఆహారాన్నిస్తూ నీకు మాత్రం ఎందుకు యివ్వడు? సాయంత్రంకల్లా తప్పక యిస్తాడు! నేను దానం చేయనంత మాత్రాన నీకేం నష్టం లేదు' అంటూ ముందుకు సాగిపోయాడు. ఆ వెనుకే వచ్చాడు నాస్తి గుప్తుడు. అతన్ని కూడా యాచించింది ముసలమ్మ. 'ఛీ! ఛీ! ఎక్కడ చూసినా దేవుడి గురించిన స్మరణే. అందుకే ఈ ప్రజలిలా అజ్ఞానంలో, పేదరికంలో వున్నారు. పాపం యింత తలచుకుంటున్నా ఈ దరిద్రులకేమన్నా మేలు జరుగుతోందా అంటే అదీ లేదు' అంటూ దేవుడ్ని అడ్డుపెట్టుకుని వ్యాపారం చేస్తున్న పురోహితుల్ని, స్వాముల్ని కూడా విమర్శించసాగాడు. ఆ మాటలు వింటున్న ఆస్తిగుప్తుడు కలుగచేసుకుని 'అసలు భగవంతుడే లేకుంటే, నువ్వెలా పుట్టావు? ఎలా జీవిస్తున్నావు?' అని ఎదురు ప్రశ్న వేశాడు. 'సృష్టికి దేవుడికి ఏం సంబంధం లేదు. మనం కావాలంటే క్లోనింగ్ ద్వారా కూడా ప్రాణులు పుడుతున్నాయి. దేవుని దయవల్ల ఆపరేషన్ జరిగిన మనిషికి గర్భం వస్తుందా' అని సవాలు విసిరాడు.