
MOULVI NASIRUDDIN KATHALU - 50
₹50
In stock · 708 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1. ప్రభువు కోసం పడిగాపులు ఒకనాడు తైమూరు చక్రవర్తి దర్శనార్థం పొరుగుదేశపు రాజప్రతినిధి ఒకడు వచ్చాడు. ఆ సమయములో తైమూరు వేటకి వెళ్ళి ఉండడం చేత ఆయన తిరిగి వచ్చే వరకూ ఆ రాజప్రతినిధికి కావలసిన సమస్త సదుపాయాలూ చేయవలసిందని నౌకర్లను ఆజ్ఞాపించాడు వజీరు. వంటవాడు అతడికోసం ఒకరోజు కోడికూర్మా, మరో రోజు బాతుపులావు, ఇంకో రోజు పావురాయి పకోడీలూ... ఈ విధంగా రోజుకి ఒక్కొక్కరకం పక్షిమాంసం వండిపెడుతున్నాడు. ఆ రాచ అతిథికి పిట్టల మాంసం మొహం మొత్తేసింది. ఎద్దు మాంసం మీద మనసు అయింది. అయితే అజర్బైజాన్ భాష రాకపోవడం చేత ఆ సంగతి ఎలా చెప్పాలో అతడికి తెలియలేదు. వంటవాణ్ణి పిలిచి తన భాషలో తన కోరికను వెళ్ళబెట్టేడు. రకరకాలుగా సంజ్ఞలు చేశాడు. ఎంత ప్రయత్నించినా అతడు ఏ మంటున్నాడో అర్థంకాక వంటవాడు వజీరుతో విన్నవించుకున్నాడు. సమయానికి రెండుభాషలూ తెలిసిన దుబాసీ ఎవ్వడూ దొరకక వజీరు మౌల్వీనపీరుద్దీనికి కబురుచేసి, సంగతి వివరించాడు. “ఆ రాజప్రతినిధిగారికి ఏంకావాలో ఎవ్వరికీ అర్ధం కావడంలేదు. మీరు స్వయంగా వెళ్ళి ఆయనకి కావలసిందేమిటో తెలుసుకురావాలి. మీ కన్న తెలివైన వాళ్ళు మన ఆస్థానంలో ఎవరు ఉన్నారు కనుక!" మౌల్వీ వెళ్ళి ఆ అతిథికి ఏంకావాలో తెలుసుకోడానికి అనేక విధాల ప్రయత్నించాడు.