MOUNARAGALU - NAVALA by SALEEM Telugu book cover

MOUNARAGALU - NAVALA

by SALEEM

₹150
In stock · 8 available
PublisherSALEEM
LanguageTelugu
Saleem- కళ్ళు మూసుకుని భైరవీ రాగం వింటున్నప్పుడు ఆమె మనోఫలకం ముందు విశాలంగా పర్చుకున్న నీలాకాశం... అందులో దూదిపింజల్లా తేలుతున్న తెలిమబ్బులు... హాయిగా రెక్కలల్లారుస్తూ ఎగురుతున్న పక్షుల గుంపు... శంకరాభరణం వింటున్నప్పుడు పచ్చటి మైదానాలు.... ఎటు చూసినా హరితవనాలు... శరీరం నిండా పచ్చలు పొదిగిన అందమైన స్త్రీలా భాసిస్తూ నేల... కాంభోజి రాగం చెవులకు సోకగానే మనసు నిండా ఆహ్లాదం కలిగిస్తూ పర్చుకున్న పసుపు రంగు... పైర్లు పసుప్పచ్చగా తలలూపుతున్న భావన... పసుపు నీళ్ళలోముంచిన మధుపర్కాలు కట్టుకున్నట్టు ఆకాశం... స్టేట్ గ్యాలరీ భవనం సిమెంటు ఇటుకల్తో అందంగా గీసి, రంగులద్దిన త్రీ డైమెన్షనల్ చిత్రపటంలా ఉంది. లోపల లాస్య ఏర్పాటుచేసిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. బైట “మౌనరాగాలు... రిథమ్ ఆఫ్ కలర్స్” అని బోర్డుమీద పెద్ద అక్షరాలతో రాసి ఉంది. ప్రవేశ ద్వారం మీద నోటీస్ బోర్డు అంటించబడి ఉంది. దానిమీద కుంచెతో ఇలా రాసి ఉంది... "మీరు సంగీతంలో రాగాల్ని విని ఉంటారు. ఎప్పుడైనా రాగాల్ని చూశారా? లోపలికి రండి. రంగుల పదాల్తో అల్లిన రాగాల్ని చూడండి. ఇవి మౌనరాగాలు...హృదయంతో వినండి... మధురంగా విన్పిస్తాయి."