MRUTHYUNJAYULU by BOLLIMUNTHA SIVARAMAKRISHNA Telugu book cover

MRUTHYUNJAYULU

by BOLLIMUNTHA SIVARAMAKRISHNA

₹80
In stock · 51 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
జనంలోంచే వస్తారు ‘మృత్యుంజయులు’ ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా, ఏ వ్యవస్థలోనైనా పాలకవర్గం పాలితవర్గం నడుమ పోరాటమంటూ ప్రారంభమయితే నాటి పరిస్థితుల అనుకూల్యతను అనుసరించి అంతిమ విజయం ఉంటుంది. ఇది చారిత్రక సత్యం. అలాటి సత్యావిష్కరణకు సృజన రూపం 'మృత్యుంజయులు' నవల. 1946లో తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైంది. ఆ పోరాటం వస్తువుగా 1947లో 'మృత్యుంజయులు' నవల అచ్చయింది. ఆ పోరాటానికి తొలి అక్షరరూపం ఈ నవల. రచనా కాలానికి రచయిత బొల్లిముంత శివరామకృష్ణ వయసు 27 ఏళ్ళు. యువకుడుగా తన కాలంలో తన సమీప ప్రాంతం తెలంగాణలో ప్రారంభమైన ప్రజాపోరాట నేపథ్యాన్ని అవగాహన చేసుకొని, దాని ఆంతర్యాన్ని అర్ధం చేసుకొంటూ, ఆ పోరాటం జరుగుతున్న తీరుతెన్నుల్ని గమనిస్తూ, ప్రజలపక్షమే అంతిమ విజయమని వైతాళిక గీతికగా ఆవిష్కరించిన కథా కథనం 'మృత్యుంజయులు' నవల. దోపిడీ, అణచివేతలలో చచ్చిబతికే మనుషుల్లోంచే పోరాట యోధులు, ధీరోదాత్తులు ఎలా పుట్టుకొస్తారో రాములమ్మ, నర్సిరెడ్డి, ఎల్లారెడ్డి, మురహరి పాత్రల ద్వారా కళ్ళకుకట్టారు. రచయిత. పాలకులూ పాలితులూ ఒకే మతానికి, కులానికి చెందిన వారయినంత మాత్రాన నవాబు గరీబుల మధ్య అగాథాలు పూడవనే సత్యాన్ని పోరాటకాలం నిగ్గుదేలుస్తుందని ఎంతో చాకచక్యంగా నిరూపిస్తారు రచయిత. కట్టుకున్నవాడూ, కన్నవాళ్ళు కళ్లెదుటే ఒకరొకరూ పాలకవర్గ మూకల కాముకత్వానికి, కండకావరానికీ, కత్తివాదరకూ, తుపాకి గుండ్లకూ బలయిపోతే బండబారిన గుండెలోనూ తొణికిసలాడిన అమ్మతనం గుండెల్ని కదిలిస్తుంది. పోరాడితే పోయేదేముందనే తెగువతో ఆయమ్మ యుద్ధపతాకను భుజానికెత్తుకుని కవాతు చేసిన ధీరత్వం, తద్వారా భావితరాలకందించిన పోరాట సందేశం పాఠకుని రోమాంచితుని చేస్తుంది. నేటికాలాన కర్తవ్యోన్ముఖుల్ని చేస్తుంది.