
MUDDHULOLIKE MEE PILLALAKU MUCHATAINA PERLU
by D.VIJAYARAO
₹25
In stock · 94 available
PublisherD.VIJAYARAO
LanguageTelugu
రచయిత్రి గురించి శ్రీమతి డి. విజయారావు 1949 నవంబరు 16న, మంచికి మారుపేరైన అడ్వొకేట్ జె.లక్ష్మీనారాయణ, యశోద దంపతులకు వరంగల్లో జన్మించారు. చిన్న వయసులోనే గుంటూరు జిల్లా రామ్మోహన్ రావు గారితో వివాహం అయింది. భర్త ఉద్యోగరీత్యా ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఉండాల్సి వచ్చింది. శ్రీవారు మంచి భోజన ప్రియులు కావడంవల్ల అన్ని ప్రాంతాలలోని అన్ని రకాల వంటలను నేర్చుకొని రుచికరంగా చేసి శ్రీవారికీ, ఇంటికి వచ్చినవారికీ పెట్టడం అలవాటైంది. "నన్ను వంటచేయడంలో పర్ఫెక్ట్ గా తయారు చేసిన క్రెడిట్ మా శ్రీవారికే దక్కుతుంది" అంటారు విజయారావు గారు. ఇదివరకే ‘ఘుమఘుమలు' పుస్తకం వారి పాకశాలలో రూపొంది అశేష తెలుగు పాఠకుల అభిమానాన్ని పొందింది. ఈటీవి, సిటీ కేబుల్, విస్సా, డి.డి.-8, ఈటీవి-2 లలో 250కి పైగా వంటలపై ఎపిసోడ్స్ ప్రసారం ద్వారా 'ఖానా ఖజానా ఆంటీ'గా లక్షలాది ప్రేక్షకులచే మన్ననలు పొందారు. ఒక్క 'సిటీ కేబుల్' (1999-2003) ద్వారానే - 170 'ఖానా ఖజానా' ఎపిసోడ్స్ నిర్వహించి ఇంతవరకు భారతదేశంలోనే టీ.వి. ఛానల్స్ ద్వారా అత్యధిక వంటల ఎపిసోడ్స్ నిర్వహించిన 'తొలి భారతీయ మహిళ' గా జీ-నెట్వర్క్ వారినుండి ప్రశంసా పత్రాన్ని పొందారు. అనేక సాంస్కృతిక సంస్థలచే పాకశాస్త్ర ప్రవీణురాలుగా అవార్డులు అందుకున్న విజయారావు గారు రూపొందించిన మరో ఆణిముత్యం...