
MUNDADUGU
₹100
In stock · 69 available
PublisherADIGOPULA VENKATARATNAM
LanguageTelugu
ముందడుగు ఏ దారీ స్వాగతించదు నా నడకే నాకు స్వాగతం అంతంలేని దారుల్లో అనంతం నా నడక! నా నడక సాగుతూంది డే కేర్ గూళ్లకు బిడ్డల్ని వదలి భుక్తి యాత్రకు పక్షులు వలసలు గూళ్లకు చెట్టు రక్షణ రాలిపోయే పూలను చూస్తూ మొగ్గలు గౌతముల్లా ఆలోచన్లో పడ్డాయి వాడిన పూలు మొగ్గల్తో మీరు మా వారసత్వమంటున్నాయి పడుచు చిలకపచ్చ పండిన పసుపుపచ్చ ఆకులు వయసుల్ని బేరీజు వేసుకుంటున్నాయి! దారికి అడ్డంగా నది నడుస్తూ పోతూంది రాళ్లను తుప్పల్ని వొడ్డును వొరుసుకుని గాయపడ్డ నీటిని తనకు తాను లోనికి లాక్కుని ఓదార్చుకుంటూంది అంతవరకు గర్భంలో దాగిన జలపుష్పాలు ఒక్కసారిగా పైకెగరి సూర్య నమస్కారం చేసి వొద్దిగ్గా వొడిలోకి జారుకుంటున్నాయి.