
MUNNEETI GEETALU
₹200
In stock · 25 available
PublisherTANA PRACHURANALU
LanguageTelugu
ప్రచురణకర్తల ముందుమాట తెలుగు నవలా సాహిత్యానికి ఉజ్వలమైన చరిత్ర ఉంది. అది చరిత్రగా మిగిలిపోకుండా వర్తమానంలోను, భవిష్యత్లోను కొనసాగాలనే భావనతోనే తానా 22 సంవత్సరాల క్రితం 1997లో నవలల పోటీ ప్రారంభించింది. ఆ మొదటి పోటీలో చంద్రలత రచించిన రేగడివిత్తులు నవల 1,30,000 రూపాయల ఏకైక బహుమతిని గెలుచుకొంది. అది విశేష పాఠకాదరణ పొందింది. అదొక సంచలనం. అప్పటినుండి తానా 2005 వరకు నవలల, కథల పోటీ నిర్వహించింది. ఆ తరువాత 2017లో సెయింట్ లూయీస్ నగరంలో తానా 40వ వార్షికోత్సవం జరిగిన 21వ మహాసభల సందర్భంగా రెండు లక్షల బహుమతి మొత్తంగా నవలల పోటీని పునః ప్రారంభించింది. దానితో పాటు మంచి పుస్తకం సంస్థ సహకారంతో బాలసాహిత్య రచనల పోటీని కూడా నిర్వహించి కొనసాగిస్తోంది. 2019లో కూడా ఈ పోటీ నిర్వహించి, బహుమతులు అందజేసింది. 2017లో ఈ నవలల పోటీలో రెండు లక్షల బహుమతిని మూడు నవలలకు కలిపి ప్రకటించి వాటిని తానా ప్రచురించింది. అవి బండి నారాయణస్వామి శప్తభూమి, కె.ఎన్. మల్లీశ్వరి నీల, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఒంటరి నవలలు. ఇవి పునర్ముద్రణలు పొంది బహుళ జనాదరణ పొందాయి. అంతేకాదు,