MUSINGS - CHALAM by CHALAM Telugu book cover

MUSINGS - CHALAM

by CHALAM

₹425
In stock · 120 available
PublisherAMARAVATHI PUBLICATIONS
LanguageTelugu
ISBN9788199677968
మ్యూజింగ్స్ పది అయినట్టుంది. గంటకొట్టారు. యములాళ్ళలాగు పరీక్షకి యిద్దరు పెద్ద మనుషులు తయారైనారు. మేంముగ్గురం యీ గదిలో మూడు గంటలసేపు పడివుండాలి. వాళ్ళు పరీక్ష వ్రాస్తారు. నేను కావిలి. చుట్టూ చూశాను, ఆ కొత్త గదిచుట్టూ, తలుపులు తెరిచిన కైదు. తలుపులోంచి చిన్నదొడ్డి కనపడుతోంది. దొడ్డిగోడ వెనక చెరువు. అవతల గట్టున మర్రిచెట్టు. నా కుర్చీవీపు వీళ్ళవేపు తిప్పి ఆ చెరువువేపు మొహం తిప్పడానికి వీలుంటే కొంత 'కన్సొలేషన్'. ఆరు గజాలదూరంలో కూచున్న ఆ యిద్దరు నిర్భాగ్యులూ కాపీ కొట్టకుండా చూడడంతప్ప యింకేపనీ నేను చెయ్యకూడదని, అధికారి భగవదాజ్ఞ. నేను చదవకండా మాట్లాడకండా ఆజ్ఞాపిస్తాడు. ఆలోచించకండా కలలు కనకుండానో! ఆకలికొన్న కుక్కలు పులిస్తరాకు మీద పడ్డట్టు వాళ్ళిద్దరూ పరీక్ష కాయితాల మీద పడ్డారు. నా ఆలోచనల్లో నేను పడ్డాను. ఈ తోటలో యిన్ని వుడతలూ, గోరింకలూ యెల్లా పోగైనాయో! గోరింకలు విసుగూ విరామం లేకుండా వాగుతో వుంటాయి. ఆ శబ్దాలకి ఏమన్నా అర్ధం వుందా లేదా? అది వాటి సంభాషణా? ఉత్త ఆనందంవల్ల అర్థం లేకుండా పలికే శబ్దాలా? తోకలెత్తుకొని చెట్లమానుల కెగబాకే వుడతల్నీ, చెట్టుకొమ్మమీదనించి వాటివంక కిందికి చూసే గోరువంకల్నీ కనిపెడుతోవుంటే, వీటికేమన్నా కష్టాలూ దుఖ్కాలూ వుంటాయా అనిపిస్తుంది. కష్టాలున్నా జ్ఞాపకం వుండవు. ఈ 'మెమొరీ' అనేది మనుషులకి యెన్ని లేనిపోని వేదనల్ని తెచ్చిపెట్టింది! చెరువులోనించి లేచి గేదెలు మర్రిచెట్టుకింద పోగవుతున్నాయి. ఆ చెట్టు వొంగి ఆ గేదెలకేసి చూస్తున్నట్టేవుంది నాకు. నిజంగా చూట్టంలేదా? నిన్న నేను మాధవధారకి వెళ్ళేటప్పుడు కొండ మీదికి నా old horse వెళ్ళలేకపోతే దాని మీదనించి దిగి నడిచాను. ఆ సైకిల్ నేను దిగిన తరవాత కిచకిచమంటోంది