MUTUAL FUNDS GUIDE-120 by SRINIWAS Telugu book cover

MUTUAL FUNDS GUIDE-120

by SRINIWAS

₹120
In stock · 10 available
PublisherSWATHI BOOK HOUSE
LanguageTelugu
ISBN9788192068541
మ్యూచువల్ ఫండ్స్ గైడ్ మ్యూచువల్ ఫండ్స్ పరిచయం రేపటి జీవనం ఎలాంటి ఒడిదొడుకులులేకుండా సాగాలంటే భవిష్యత్తులో వచ్చే ఆదాయం కోసం మనం సంపాదించిన సంపదలో మన ఖర్చులు పోగా మిగిలిన సంపదను పెట్టుబడిగా పెట్టి మరింత సంపదను పొందడమే పెట్టుబడి ఒక్క ముఖ్య ఉద్దేశం. ఈ పెట్టుబడి అనునది మనం స్తిరాస్తి, బ్యాంకు డిపాజిట్లు, వడ్డీ ఆదాయం, అద్దె ఆదాయం, షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, సేవింగ్ సర్టిఫికేట్లు, వివిధ పోస్ట్ ఆఫీసు పథకాలు, బంగారం మొదలగు వాటిలో పెడతాం. మన పెట్టుబడి ఒక్క ముఖ్య ఉద్దేశం సంపద సృష్టించడం, దానితో పిల్లల కళాశాల ఫీజులు, పెళ్ళిల్లు, సెలవులలో సరదాగా గడపడం, మంచి జీవన ప్రమాణానికి, రిటైర్మెంట్ తర్వాత జీవితం సాఫీగా జరుగుటకు, మీ అనంతరం ఈ సంపద మీ తరాల వారికి చేర్చటం. ఈ పెట్టుబడి వల్ల వచ్చే రాబడి పెరుగుతున్న ద్రవ్యోల్బణం కంటే అధికంగా ఉండాలి. ఎప్పుడైనా సరే సంపదను కాపాడటం మరియు దానిని అభివృద్ధి చేయడం అనేది ఒక్క కళ. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి వల్ల మీరు మిగితా వాటిలో పొందిన రాబడి కంటే అధిక రాబడి పొందగలరు. కాని దీనికి మీకు స్టాక్ మార్కెట్పై పరిపూర్ణ జ్ఞానం, దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహం, సరియైన స్టాక్ను ఎన్నుకోవడం మొదలగు వాటి మీద ఆధారపడి ఉంటుంది. మీరు పెట్టుబడి అనునది మీ సంపాదన మొదలైన తొలినాళ్ల నుండి క్రమ పద్ధతిలో దీర్ఘకాలిక వ్యూహంతో మొదలు పెట్టాలి. మీరు తొలినాళ్ళ నుండే మొదలు పెడితే అనుకోకుండా జరిగే ఎలాంటి రిస్కులను ఐనా తట్టుకోగలరు. అంతే కాకుండా, ఒక్క వేళ మీరు మీ రిటైర్మెంట్ నాటికి యాబై లక్షలు సంపాదించడం మీ లక్ష్యం ఐతే మీరు మీ సంపాదన తొలినాళ్ల నుండి పెట్టుబడి మొదలు పెడితే మీ లక్ష్యం చేరుకోవడం చాలా సులభం అవుతుంది. మార్కెట్లో పెట్టుబడులు అంటే రిస్క్ అంటారు, స్తిరాస్తి, బంగారం, చివరకు మనకు అన్నం పెట్టె రైతన్న చేసే వ్యవసాయంలో కూడా ఎంతో రిస్కు ఉంది. పండించే.......