
N.F.I.W - TOLI ROJULA CHARITRA
₹300
In stock · 416 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
Mahila Udyama Nuthana Panthaaki Daarulu Vesina N.F.I.W. - Telugu Translation by Paruchuri Jamuna 1954లో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యు.) ప్రారంభమైంది. భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన తరువాత ప్రారంభ దశాబ్దాలలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో మహిళల సమానత్వానికి కట్టుబడి ఉన్న వ్యక్తులు, సంస్థలు ఐక్యమై జాతీయ మహిళా ప్రజా సంఘాల వేదికలలో ఒకటిగా రూపుదిద్దుకోవడానికి తోడ్పడింది. మహిళల పోరాటాలకు, శ్రామిక ప్రజానీకానికి మధ్య తప్పనిసరిగా రాజకీయ సంబంధాలుంటాయని విశ్వసిస్తూ, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో శ్రామిక వర్గాల నుండి, రైతాంగం నుండి పెద్దయెత్తున అసంఖ్యాకంగా మహిళలను సమీకరించడం ద్వారా ఫెడరేషన్ మహిళా ఉద్యమంలో కొత్త మార్గాన్ని- నూతన పంథాను రూపొందించింది. ఈ పుస్తకం ఫెడరేషన్ ప్రారంభ చరిత్రను నమోదు చేసింది. ఇది ఫెడరేషన్ ఆవిర్భావానికి తోడ్పడిన జాతీయ, అంతర్జాతీయ కారణాలపై, 1940లలో ప్రాంతీయ సామూహిక మహిళా సంస్థల ఆవిర్భావం, అవన్నీ కలిసి ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యు.ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించడం, 1945లో ఉమెన్స్ ఇంటర్నేషనల్ డెమోక్రటిక్ ఫెడరేషన్ (డబ్ల్యు.ఐ.డి.ఎఫ్.) ఏర్పాటు మొదలైన వివిధ సంబంధిత అంశాలపై అంతర్దృష్టిని ప్రసరిస్తుంది. పుస్తకంలోని అధ్యాయాలు అన్నీ - హిందూ కోడ్ బిల్లు, వరకట్న రద్దుతో సహా వివిధ సామాజిక, చట్టపరమైన సంస్కరణల గురించి - మహిళలకు ఉపాధి హక్కులు, మెరుగైన పని పరిస్థితుల కోసం పోరాటాలు, అక్షరాస్యత, ఆహార భద్రత, ఇతర ప్రాథమిక సౌకర్యాల కోసం ప్రచారోద్యమాలు, సామాజిక అణచివేత, మత ఛాందసవాదం, మతతత్వానికి వ్యతిరేకంగా పోరాటం, ప్రపంచ వ్యాప్తంగా శాంతి, ప్రజాస్వామ్యం కోసం సాగుతున్న పోరాటాలకు అంతర్జాతీయ సంఘీభావం మొదలైనవన్నీ - సంస్థ సిద్ధాంత భావజాలానికి, ఆచరణకు అనుగుణంగా రూపొందాయి. ఫెడరేషన్ ప్రారంభ చరిత్రను డాక్యుమెంట్ చేయడంలో, ఈ పుస్తకం మహిళా ఉద్యమానికి సంబంధించి ఒక ముఖ్యమైన దశను కాలాన్ని తెలియచేస్తుంది. చాలా తరచుగా, స్వతంత్ర భారతదేశం మొదటి దశాబ్దకాలంలో ఈ ఉద్యమం పుట్టుక ఒక ముఖ్యమైన మలుపుగా గుర్తించబడింది. అయితే ఆ సమయంలో చేపట్టిన అనేక క్లిష్టమైన సమస్యలు, ఆందోళనలు అప్పటికప్పుడు ఏదో శూన్యంలో నుంచి ఊడిపడలేదు. ఎన్నో దశాబ్దాలుగా సామాజిక-రాజకీయ సమస్యలతో కూడిన విస్తారమైన ఈ భూభాగంపై మహిళా సంఘాలు సాగించిన సుదీర్ఘ, నిరంతర ఉద్యమాలు ఈ మహిళా పోరాటానికి విలువైన మైదానాన్ని సిద్ధం చేశాయన్న అంశాన్ని గమనంలోకి తీసుకొని గుర్తించి సమీక్షించాల్సిన అవసరం ఉంది. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN:978-93-48126-40-5