
NA VYASA PEETAM
by DESIRAJU LAKSHMI NARASIMHA RAO
₹450
In stock · 12 available
PublisherDESIRAJU LAKSHMI NARASIMHA RAO
LanguageTelugu
. ఈ పుస్తక ముద్రణ గురించి నాదొక మాటల మూట వ్యాసాలు వ్రాయడం పాఠశాల, డిగ్రీ కళాశాల స్థాయిలో నా చిన్నతనాన అదిగి ఉండవచ్చు. విద్యార్ధిగా నేను మా అధ్యాపకుడు, ఉపన్యాసకుడు ఇచ్చిన శీర్షికలపై వ్రాతాదేమో! స్ఫురణకు రావడం లేదు. డిగ్రీ పట్టా చేతబుచ్చుకుని, అటు ఉన్నత విద్యాభ్యాసానికీ, ఇటు ఉద్యోగం వెతుక్కోవడానికీ మా చుట్టాలందరితో పాటే నేను హైద్రాబాదు వచ్చాను. 1978, ఆగష్టు లో రాష్ట్ర ఆరోగ్యరవాణా సంస్థ, యస్సా ఆర్ నగర్, హైద్రాబాదు-38లో పిస్టుగా చేరాను. 1970 నుండే తెలుగు సాహిత్యం లోని వివిధశైలులు గూర్చి చదవడం, వినడం, చూడటం, తెలుసుకోవడం, గ్రహించడం, గుర్తుంచుకోవడం, ఏదైనా సందర్భంవస్తే చెప్పడం అలవాటైంది. అలా తెలుగులో భావ కవిత్వం చెప్పడం, 'చందమామ', 'బాలమిత్ర', 'బొమ్మరిల్లు' పుస్తకంకు చిన్న పిల్లల కథలు వ్రాయడం, దిన-వార-మాస పత్రికలు చదవటం, ఎవరు, ఎలా, ఎందుకు, ఏశైలిలో వ్రాశారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే శ్రద్ధ, ఏకాగ్రత, జిజ్ఞాస, తపన, తృష్ణ, ఆతృత ఇవన్నీ నా చిన్ని బుర్రలో చోటుచేసుకున్నాయి. 1979 నుండి నాకు వ్యాసరచన మొదలై, తర్వాత తర్వాత అలవాటై, దినదినాభివృద్ధి చెంది, వార్తాపత్రికలలో సంపాదకీయపుటలలో ప్రచురణలుగా వాచాయచిత్రంతో సహా అచ్చు అయ్యే స్థాయి దాకా ఎదిగింది. ఓ వారపత్రికలో వటనకు నిర్వచనం 'సావిత్రి' అనే అంశంపై కిన్నెర ఆర్ట్ థియేటర్స్, నల్లకుంట, హైద్రాబాదు వారు 1979లో 'సావిత్రి నట జీవిత రజతోత్సవసభ', ఎల్. బి. ఇండోర్ స్టేడియంలో నిర్వహించ బోతూ ప్రకటించారు. నాకున్న మిడిమిడి (అ) జ్ఞానంతో కేవలం 23 ఏళ్ళవయస్సులో ఓ వ్యాసం వ్రాసి పంపిస్తే, రాష్ట్ర స్థాయిలో ప్రధమ బహుమతి వచ్చింది. ఇంకేముంది. మొహం చాటంత ఐంది. తర్వాత సావిత్రి చేతులమీదుగా ప్రధమ బహుమతి అందుకున్నాను. సావనీర్ లో ప్రచురితమైనది. ఇక కొన్నాళ్ళ పాటు భూమ్మీద కాళ్ళు లేవు. నాకు 1982-83లో ఎం.ఏ. (చరిత్ర) చదువుతుండగా, ఆర్ట్స్ కాలేజీ, ఓ.యూ. వారు నిర్వహించిన కళాశాల స్థాయి వార్షిక, సాంస్కృతిక ఉత్సవాలలో 'మతము-రాజ కీయాలు' అనే అంశంపై వ్రాసిన వ్యాసానికి ప్రధమ బహుమతి రావడం, ఆబహుమతి అప్పటి ఓ.యూ. ఛాన్సలర్ చేతులమీదుగా అందుకోవడం మరింత ప్రోత్సాహకరమైంది. అప్పటికే కధ, కవిత, గేయరచన, నాటిక రచన, మున్నగు శైలులలో వ్రాసిన సాహిత్యంలో హైద్రాబాదు-బి ఆకాశవాణి కేంద్రంలో ప్రోగ్రాములు ఇవ్వడం 1979 నుండే మొదలైంది.