NAA ADARSHALU ANUBHAVALU by K.S.SASTRI Telugu book cover

NAA ADARSHALU ANUBHAVALU

by K.S.SASTRI

₹200
In stock · 23 available
PublisherSMT.K.RAMANAMMA
LanguageTelugu
నా మాట ప్రజాసేవలో నా అనుభవాలు, సాధించిన సత్ఫలితాలతో నా జీవిత చరిత్ర వ్రాయడం అవసరమని, ముందు తరాల వారికి అది మార్గదర్శికంగా వుండవచ్చునని, స్నేహితులు - ఆప్తులు డా|| గూటాల కృష్ణమూర్తి 1985లో నేను, నా భార్య రమణమ్మ అండను వెళ్ళినప్పటి నుండి ఒక రకంగా ఒత్తిడి తెస్తూనే వున్నాడు. స్నేహితులు, అభిమానులు శ్రీ మట్టా వరహాలుచెట్టి కూడా వ్రాయడం మంచిదంటూ డా|| గూటాల సలహాను సమర్థించడమూ వుంది. నాకు మాత్రం కొంతకాలం వరకూ దాని విలువ గురించి నమ్మకం కుదరలేదు. కాని దీర్ఘంగా ఆలోచించగా ప్రస్తుతం దేశ రాజకీయ నాయకులలో ప్రజాసేవకులమని చెప్పుకుని చలామణి అవుతున్న వారిలో, నేటి సంఘంలో నీతి నిజాయితీలకు తిలోదకాలిచ్చి స్వార్థ చింతకే విలువ కట్టడం వుంది. ఈ వాస్తవికత అనుభవంలో వున్నప్పుడు ఐదు తరాల మానవ జీవితాలకు సాక్షిగా నిలచిన నేను 3 దశాబ్దాల స్వాతంత్య్ర సమరంలో సిద్ధాంతాలకు విలువనిస్తూ, నిస్వార్థ సంఘసేవే తమ ధ్యేయంగా పెట్టుకున్న అనేకమంది మహాపురుషుల ఆదర్శాలు, వారి త్యాగనిరతి గురించి యీనాటి యువకులకు, భావితరాల వారికి కూడా వివరాలు అందించవలసిన అవశ్యకతను నావంటి వారి బాధ్యతగా గుర్తించేను. పరపాలనను తరిమి వేసిన పూర్తి స్వాతంత్య్రదేశంలో ప్రతి ఒక్కరి జీవితం సుఖప్రదమై మానవ వికాశం సాధించవచ్చుననే కోరికతోనే మహాత్మాగాంధీజీతో పాటు నాలాంఠి వారు వరకూ అందరూ కలలు కన్నారు. కానీ స్వాతంత్య్రం వచ్చి 56 సంవత్సరములు గడిచినా, దేశజనాభాలో నూటికి ముప్పదిమంది దారిద్య్రంతో దుర్భర జీవితం గడుపుతున్నారన్నిది సత్యం. మనకు కావలసినంత మానవశక్తి, ప్రకృతి సంపద వుంధి. అపారమైన నదీ జలాలు వున్నాయి. "సుజలాం, సుఫలాం మలయజశీతలాం, సస్యశ్యామలాం మాతరం వందేమాతరం" అన్నది మన జాతీయగీతం. అన్నీ వున్నా దారిద్య్రం నిరక్షరాస్యత, నిరుద్యోగం తాండవిస్తున్నాయని అనేకమంది ప్రజాహితులు బాధపడుతున్న వారున్నారు. మనదేశ మేధాశక్తి యిప్పటికే అత్యధిక ధనిక దేశాలు అబివృద్ధికి సంబంధించిన సేవలకే ఉవ్వుళ్లూరుతోంది. రాజకీయాలలో, అధికార వర్గాలలో స్వార్థం, అవినీతి పెరిగిపోయి, హద్దూ అదుపూ లేని మానవదోపిడీకి దారి తీస్తోంది. గ్లోబలైజేషన్ పేరుతో రాజ్యమేలుతున్న రాజకీయ పార్టీలు, నాయకులు అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులు తమ స్వార్ధ త్యాగాలు ద్వారా అందించిన ఆదర్శాలను, లక్ష్యాలనూ విస్మరించేరు. దేశభక్తి శూన్యమైంది.