
NAA PARTY GEYA KAVYAM
₹60
In stock · 99 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789348126344
వర్గపోరాటమే ఊపిరైన కమ్యూనిస్టు పార్టీ, దాని ప్రజా సంఘాలు గడిచిన వందేళ్లలో భారత ప్రజలతో ముఖ్యంగా ఆంధ్ర ప్రజలతో ఎంతో మమేకమయ్యాయి. ఎందరో సామాన్యులను కవులుగా, రచయితలుగా, ప్రజా కళాకారులుగా కమ్యూనిస్టు ఉద్యమం సృష్టించుకుంది. అలాంటివారిలో ప్రముఖుడైన అభ్యుదయ రచయత, కమ్యూనిస్టు కవి కాగితాల రాజేశ్వరరావు కమ్యూనిస్టు ఉద్యమమే జీవితంగా జీవించినవాడు. విరామమెరుగని అభ్యుదయ పథగామి. 'సాహిత్యంలో సవ్యసాచి' సొదుం రామ్మోహన్: 'ఛందో తరంగవేది రాజేశ్వరరావు. ఇలాంటివాళ్ళే ఉద్యమాలకు ఉద్రేకం, ఉత్తేజం. అరుదైన సాహితీమూర్తులు, మహత్తర శ్రామికవర్గ మిత్రులు. 'ఇంత పాండిత్యం, ఇంత ప్రతిభఒక వ్యక్తిలో ఉండటం అరుదైన విషయం' అని ప్రముఖ విమర్శకులు చేకూరి రామారావు, 'అభ్యుదయ సాహిత్యోద్యమ యోధుడు కెరా' అని చందు సుబ్బారావు, 'అభ్యుదయోద్యమ ఉత్తుంగ తరంగం రాజేశ్వరరావు' అని తెలుగు విశ్వవిద్యాలయ విశ్రాంత ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ లాంటి ప్రముఖ సాహితీ ప్రముఖులు, ఆప్తులు రాజేశ్వరరావును శ్లాఘించారు. తెలుగుబాలల్లో శాస్త్రీయ భావాల వ్యాప్తికోసం విశాలాంధ్ర విజ్ఞాన సమితి వెలువరించిన 'చిన్నారిలోకం' మాసపత్రికకు దశాబ్ద కాలం (1985-1995) రాజేశ్వరరావు (కేరా) సంపాదకుడిగా వున్నారు. మూడున్నర దశాబ్దాలు విద్యార్థి, యువజన, ప్రజానాట్యమండలి, కమ్యూనిస్టు ఉద్యమాల్లో అవిశ్రాంతంగా పని చేశాడు. విజయవాడ నగర కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన కాగితాల కృష్ణమూర్తి రెండో కుమారుడిగా తండ్రి సాంస్కృతిక, ఉద్యమ వారసత్వాన్ని కేరా పుణికిపుచ్చుకున్నాడు. అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ పట్టు సాధించిన అభ్యుదయ కవిగా ప్రసిద్ధుడు. కమ్యూనిస్టు ఉద్యమంలో ఎదిగి ఒదిగిన గొప్ప ప్రజాకవి రాజేశ్వరరావు. భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రను ఒక గేయకావ్యంగా 'నా పార్టీ' పేరుతో రచించాలని ఉందని రాజేశ్వరరావు చాలా వేడుకల్లోనూ, సాహితీ సమావేశాల్లోనూ చెప్పేవాడు. అది తన సాహిత్య జీవితంలో మైలురాయి అవుతుందనేవాడు. కానీ రాజేశ్వరరావు వ్యక్తిగత పరిస్థితుల రీత్యా 'నా పార్టీ' గేయకావ్యం అసంపూర్తిగానే మిగిలిపోయింది.