NAADI DUKHAM VEEDANI DESAM by HANEEF Telugu book cover

NAADI DUKHAM VEEDANI DESAM

by HANEEF

₹120
In stock · 22 available
PublisherHANEEF
LanguageTelugu
Naadi Dukham Veedani Desham ఏకకాలంలో అద్భుతమూ, హృదయ విదారకమూ, భావస్ఫోరకమూ, సమస్త చరిత్రసారమూ అయిన 'నాది దుఃఖంవీడని దేశం' అనే శీర్షికతో వెలువడుతున్న హనీఫ్ కవిత్వానికి నిజానికి ఎవరి ముందుమాటా అవసరం లేదు. ఈ కవితలన్నీ మన సామాజిక అవ్యవస్థకు దర్పణాలు. ఆ అసందర్భ, అస్తవ్యస్త సామాజిక వ్యవస్థ మీద కవి ఆగ్రహ ప్రతిఫలనాలు, సాంద్ర తాత్విక వ్యక్తీకరణలు. తాత్వికతా కవితా కలగలసిన తాత్వికవితలివి. ప్రతి కవితా పాఠకులకు ఇప్పటికి తెలియని ఒక సామాజిక దృశ్యాన్నో, లేదా తెలిసిన దృశ్యంలోనే గమనించని కోణాన్నో పట్టుకొని, కళాత్మక సాధారణీకరణతో ఆలోచనలు రేపి, తాత్విక దృక్పథం అందించి అవగాహనను ఉన్నతీకరిస్తుంది. ఆదివాసులు, దళిత బహుజనులు, స్త్రీలు, ముస్లింలు, ఇతర మైనారిటీ మతస్థులు, అణిచివేతకూ, పీడనకు గురవుతున్న ప్రాంతీయ, భాషా సమూహాలు, ఒక్కమాటలో చెప్పాలంటే ఈ దేశంలోని సమస్త పీడిత అస్తిత్వాలూ తమలో తాము అనుకోదగిన మాట 'నాది దుఃఖం వీడని దేశం.' - ఎన్. వేణుగోపాల్