NAALUGU DASABDALA ANDHRA PRADESH PRAJA NATYAMANDALI (1974 - 2014) by NALLURI VENKATESWARLU Telugu book cover

NAALUGU DASABDALA ANDHRA PRADESH PRAJA NATYAMANDALI (1974 - 2014)

by NALLURI VENKATESWARLU

₹260
In stock · 331 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
తెలుగునాట కళా, సాహితీ, సాంస్కృతిక రంగాలను స్వాతంత్ర్యానికి పూర్వం ప్రభావితం చేసిన సంస్థలలో అరసం (అభ్యుదయ రచయితల సంఘం), ప్రజానాట్యమండలిది అద్వితీయమైన పాత్ర. తెలంగాణా ప్రాంతంలో భూ సంబంధాలను తిరగరాయ పూనుకొన్న రైతాంగ సాయుధ పోరాటాన్ని ముందుకు నడిపించడంలోను ఈ సంస్థలు తిరుగులేని పాత్రను నిర్వహించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక యుగ జీవితాన్ని ఈ సంస్థలు బహుముఖంగా ప్రభావితం చేశాయి. ఆంధ్రనాట 1955లో జరిగిన ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ అనూహ్య ఓటమి తరువాత ఈ సంస్థల నిర్మాణ కార్యకలాపాలలో కొంత స్తబ్దత చోటు చేసుకుంది. అలాగే జాతీయ, అంతర్జాతీయ పరిణామాల ఫలితంగా భారత కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన సిద్ధాంత విబేధాలు, చీలికల మూలాన ఈ సంస్థలు పూర్తిగా నిస్తేజమయ్యాయి. ఈ నష్టాన్ని గుర్తించి ప్రజాకళలు, సాంస్కృతిక రంగాన్ని పునరుద్ధరించడానికి భారత కమ్యూనిస్టుపార్టీ (సి.పి.ఐ) 1970వ దశకంలో పూనుకొన్నది. 1974లో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలిగా పునరుద్ధరించబడిన సంస్థ నిర్మాణంలో నాలుగు దశాబ్దాలపాటు కీలక బాధ్యతలు నిర్వహించిన కళా, సాంస్కృతిక యోధ నల్లూరి వెంకటేశ్వర్లు (అన్న), ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలిని ఒక కళా, సాంస్కృతిక రంగ సంస్థగా రూపుదిద్దడంలో, రాష్ట్ర స్థాయి సంస్థగా దానిని విస్తరింపచేయడంలో, సంస్థ ద్వారా బహుముఖ జానపద కళారూపాలకు జవసత్వాలను అందించడంలో నాలుగు దశాబ్దాల (1974-2014) పాటు నల్లూరి అపూర్వమైన పాత్ర నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి పునరుద్ధరణ, విస్తరణ, ఆ సంస్థ బహుముఖీన పాత్రలకు జీవం పోసిన వ్యక్తిగా ఆ సంస్థ చరిత్రకు, దానిలోని ప్రధాన ఘట్టాలకు నల్లూరి ఇచ్చిన అక్షర రూపమే ప్రస్తుత రచన.