
NADAKA-70
₹70
In stock · 13 available
PublisherSHANMUKESWARA PRACHURANALU
LanguageTelugu
コ ఈ క్షణంలో ఓ సగం... "వేడుక గురించి తెలియని వారు ఉండరు. వాకర్స్ అసోసియేషన్లు, వారు ప్రచురించే మైత్రికలు నడక మీద స్పృహ పెంచుతున్నాయి. ఆరోగ్య స్పృహ విపరీత ధోరణిలో ది సలహాలు, సంప్రదింపుల దగ్గర ఫుల్స్టాప్తఓ ముగుస్తున్నది. 'నడక' గురించి కొత్తగా తెలుసుకోవలసింది కూడా ఉంటుందా? మనకు తెలిసిన విషయాలన్నీ ముపూర్ణతను పొంది ఉండకపోవచ్చును. నడకను ఏ కోణంలో అంచనాకట్టాలి. నడకను - విధంగా ఆచరించాలి. ఏ వాతావరణంలో, ఎక్కడెక్కడ నడవాలి. నడవకూడని పరిస్థితులు ఏమిటి? నడకకు సంసిద్ధం కావడం ఎలా? నడకకు ముందు, తర్వాత మనం ఏమైనా తాగాలా? మొదలైన పలు లోతైన అంశాలను సుదీర్ఘంగా తేలికైన భాషలో వివరించడానికి ప్రయత్నించాను. వాస్తవానికి నడక మీదనే మన జీవితం నాణ్యత ఆధారపడి ఉంటుంది. సాధారణ ఆరోగ్యం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ తెల్లవారు జామునే నడవడం ఒక అనివార్యమైన దినచర్యగా భావించాలి, ఆచరించాలి. తొలిపొద్దు నడక వల్ల శరీరం దూది పింజలా అనిపిస్తుంది. చిన్న చిన్న రుగ్మతలు ఏవీ మనల్ని పలకరించలేవు. మానసిక ఉల్లాసం ఆ రోజంతా మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది. తద్వారా మన జీవితకాలం పెరుగుతుంది. ఆలస్యంగా నిద్రలేచేవారు ఈనాటి యాంత్రిక యుగంలో అనేకులు. ఆ మహానుభావులు సాయంత్రం వేళల్లో నడవడం మంచిది. అదీ సాధ్యపడదా? నడక మీద నిజమైన శ్రద్ధ ఉంటే మీ తీరిక వేళల్లో అయినా నడవడం, లేదా పచార్లు చేయడం అలవాటు చేసుకోవడం జీవితకాలం పొడిగింపుకు అవసరం. అసలు, మన బద్దకాన్ని, సోమరితనాన్ని వదిలించే ప్రక్రియలలో అతిసుళువైనది నడకే! ప్రకృతిలో నడక ఒక అంతర్భాగం. ఈ విశాల విశ్వంలోని గోళాకార పదార్ధములు యావత్తూ పరిభ్రమణం చేస్తుండటంతోనే విశ్వం మనుగడ సాగిస్తోంది. గ్రహాలు గమనం చేయకపోతే విశ్వం స్తంభించిపోతుంది. మనమూ ప్రకృతిలో ఒక అణువు. ప్రకృతిని అనుసరించడమంటే జీవితం విలువ తెలుసుకున్నట్లే. నడక విషయంలో కూడా ఆరంభ శూరులు కోకొల్లలు. ఏవేవో అడ్డంకులను సృష్టించుకొని తప్పించుకోవాలనే ఆలోచిస్తుంటారు. ఏ వేళలోనైనా, ఏ ప్రాంతం దిశగా వైనా నడక సాగించడానికి సిద్ధపడాలి. ఎండలో, చలిలో, వానలో అలుపు ఎరుగని నడకను సాగించే వారి శరీరంలో రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. నడక అనేది మన జన్మహక్కు మన ఆరోగ్యానికి ప్రత్యక్ష ప్రతినిధి. నడక ఉంటేనే సజీవత్వం,