NADI NADALU by SIDDANI NAGABHUSHANAM Telugu book cover

NADI NADALU

by SIDDANI NAGABHUSHANAM

₹125
In stock · 92 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
రచయిత మాట జలమే జీవరాసులకు ఆధారం. జలం లేనిదే జీవనమే లేదు. ప్రతి చరా చర జీవరాసుల మనుగడకు జలమే కీలకం. అన్నింటిలోనూ జలం ఉంది. జీవరాసులతో నిండిన మంచి నీరు ప్రకృతికి మూలమని చెప్పవచ్చు. సాగరంలో అపార జీలరాసుల్లో ఉన్న నీరు, సూర్య ప్రతాపం వల్ల ఆవిరై, మేఘమై, వర్షమై తిరిగి వర్షం రూపంలో భూమికి చేరుతుంది. అదే నీరు భూమిపై పడుతుంది. అదే నీరు గుట్టలపై, మిట్టల పై, కొండలపై పడి పల్లం వైపు, దిగువ ప్రాంతాల వైపు పయనం సాగిస్తున్నది. మొదట్లో చిన్న చిన్న నీటి ప్రవాహాలై, సెల ఏరులై పల్లపు ప్రాంతానికి ముందుకు సాగుతుంది. పర్వసానువుల నుండి వర్షపునీరు మైదాన ప్రాంతంలో అడుగిడుతుంది. కొంత వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భంలో ఉంటుంది. మరి కొంత నీరు మైదాన ప్రాంతం నుంచి తొలుత పొలాలకు, ఎక్కువైన నీరు, ఉపయోగించని నీరు పొలాలను దాటుతూ తిరిగి సముద్రంలో కలుస్తుంది. పర్వతాల్లో పడిన వర్షం నదిరూపం దాల్చుతుంది. ఆ ప్రాంతంలో పచ్చదనంతో కల కల లాడుతున్న ప్రాంతం జనవాసమవుతుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని నదులలో పారే నీటిని ఆపి, అవసరమైనప్పుడు ఉపయోగించి ప్రాంతం అంతా పచ్చదనం, కలకలలాడేలా మానవుని కృషి జరుగుతుంది. ఆకాశం నుండి ఎక్కడో పడిన వర్షం నదిగా రూపాంతరం చెందుతుంది. ఆ నదిలో నిరంతరం పుష్కలంగా నీరు ఉండకపోవచ్చు. అయినా నీటికి ఆ నది వాహకంగా పనిచేస్తుంది. ఒక నది ఫలానా ప్రాంతంలో పుట్టింది అని ఇతిమిద్దంగా చెప్పలేం. ఒక పర్వతం మీద పుడుతుంది. అది పర్వతాలు దాటుతూ పర్వతాల లోయల్లో ప్రవహిస్తూ ఒక ప్రాంతంలో నది ఉన్నంత మాత్రాన ఆ జిల్లాకు సంబంధించింది కాదు. ప్రకృతి పరంగా ఉన్న నీటిపై పెత్తనం ఎవరిది? నది పుట్టుక ఎక్కడఝ దాని సాగర సంగమం ఎక్కడ? ఉదాహరణకు గంగానది, బ్రహ్మపుత్ర నదీపుట్టుకలు ఎక్కడ? గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, వంశధార నదులు పుట్టిన జన్మించిన రాష్ట్రాలకు ఉపయోగపడడమే కాదు. ఇతర ప్రాంతాలకు కూడా ఉపయోగపడుతున్నాయి. నదుల జలాలు రాష్ట్రాల సంపదగా గాక దేశ సంపదగా పరిగణించవలసి ఉంది. ఆనాడే దేశ సౌభాగ్యం ఉంటుంది. జాతీయ సంపదగా గుర్తించి ఆ వినియోగాన్ని ఎక్కువ చేయాలి. నదీ జలాలను జాగ్రత్తగా, పొదుపుగా వినియోగించాలి. జలాలఉత్పాదకత పెరిగెలా కృషిచేయాలి. నదీ జలాలు కాలుష్యం బారినుండి రక్షింపబడేలా కృషి చేయాలి. దీని వల్ల పంటలకే కాదు, మంచినీటికి కూడా ఆ నదులు ఉపయోగపడతాయి. జలాలు కాలుష్యం బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు ప్రజలపై కూడా వుంది.