
NAGETI CHAALU
₹140
In stock · 321 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
దొరకోటు ఆదం ఇవేళ జోరుగా నడుస్తున్నాడు. వాలునీటి మీద తెప్ప కొయ్యలా వీధి కిరువైపుల కూర్చునున్న జనం చూపుల మధ్య ఒదిగొదిగి సర్రున జారిపోతున్నాడు. ఎత్తిన తెరచాపలా రొమ్ము విరుచుకుని మరీ అడుగులేస్తున్నాడు. రెండుమూరల గుడ్డ నడుముకు చుట్టుకుని, పేదరికపు మరకలు పడ్డ చిరుగుల చొక్కాతో, పీలికలైన నల్లటికంబళి భుజానేసుకుని, ఒకచేత పెద్ద డొక్కు లాంతరు, మరోచేత పోటుకర్రతో వయోభారంతో వుసూరుమంటూ వెళ్తూ, చేవదేలని గడకర్రలా వుండే అదంసు సాయంత్రం వేళ రోజూ చూస్తూనే వుంటారు