NALLA CHEPA PILLA KATHA - 30 by SAMAD JEHARAGHEE Telugu book cover

NALLA CHEPA PILLA KATHA - 30

by SAMAD JEHARAGHEE

₹30
In stock · 645 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఈ పుస్తక రచయిత “సమద్ బెహరంఘీ” ఇరానీ దేశస్థుడు. 1939లో తజ్రిబ్ అనే పట్టణంలో జన్మించాడు. సమద్ బెహరంఘీకీ రచయితగా ఇరాన్ జాతీయ స్థాయిలో విశేషమైన గౌరవం ఉ ంది. ఇరాన్ రాజు నియంతృత్వాన్ని, నిరంకుశ పాలనని సమద్ తీవ్రంగా నిరసించాడు. ప్రజల్లో చైతన్యాన్ని రగులుకొలిపే సాహిత్యాన్ని పుంఖాను పుంఖంగా రచించాడు. అందులో ఒక భాగమే ఈ నల్ల చేప పిల్ల కథ. చేప పిల్లను పాత్రగా తీసుకుని అద్భుతమైన వైజ్ఞానిక దృక్పథాన్ని పిల్లల్లో కలిగించాలనే ప్రయత్నం చేశాడు. బాలల సాహిత్యాన్ని, సంస్కృతినీ కూలంకషంగా అధ్యయనం చేసిన సమద్ "బాలసాహిత్యంలో రెండు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ రెండు అంశాలను ప్రాతిపదికగా చేసుకుని రచనలు చేయాలి" అన్నాడు. మొదటి అంశం : "బాల సాహిత్యం వాస్తవ దూరమైన రంగుల ప్రపంచానికి అతి దూరంగా ఉండాలి. బాల్యావస్థలో మృదు మధురమైన కల్పనలకు, బాధతో కూడిన సామాజిక వాస్తవాలకు, కఠినమైన జీవిత సత్యాలకు, విద్యా, విజ్ఞానము సాంఘిక పరిస్థితులకు మధ్య వారధిగా ఉండాలి. పిల్లలు తమ తల్లిదండ్రులు పట్టెడు మెతుకుల్ని సంపాదించడానికి ఎన్నెన్ని కష్ట నిష్టూరాలకు గురవుతున్నారో తెలుసుకోవాలి" అన్నాడు సమద్. రెండో అంశం : “మనం మన పిల్లలకు సరైన, శాస్త్రీయమైన ఆలోచనా పద్ధతిని అందించాలి. ప్రతి క్షణం అనేక మార్పులకు, చేర్పులకు గురవుతున్న సమాజంలోని వివిధ నైతిక, సాంఘిక సమస్యలను వివిధ కోణాల నుండి అవగాహన చేసుకుని వాటిని క్రమంగా అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పించాలి" అంటూ ఖచ్చితంగా చెప్పాడు సమద్. తన జీవితాంతం అటువంటి రచనలే చేశాడు. 1969లో “చెకొస్లోవేకియా” లోని “బ్రాటీస్లావాలో”, ఇటలీలోని “బొలాగ్నా” లోను జరిగిన పుస్తక ప్రదర్శనల్లో ఈ కథ మొదటి బహుమతులు గెలుచుకుంది. స్వేచ్ఛనీ, స్వాతంత్ర్యాన్ని, విజ్ఞానాన్ని, శాస్త్రీయమైన ఆలోచనా విధానాన్నీ బోధించే ఈ కథ తెలుగుదేశంలో ప్రతి ఇంట్లోనూ ఉండవలసిన అవసరం ఎంతో ఉంది. పబ్లిషింగ్ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్