NALLA KUKKA - 50.00 by DR.M.HARIKISHAN Telugu book cover

NALLA KUKKA - 50.00

by DR.M.HARIKISHAN

₹50
In stock · 664 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
అక్కా - చెల్లెలు ఒకూర్లో ఒక రైతున్నాడు. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరికీ పెండ్లి చేసినాడు. పెద్దపిల్ల మొగుడేమో పెద్ద షావుకారు, చిన్నపిల్ల మొగుడేమో చిన్నరైతు. కొంతకాలానికి పెద్దపిల్లకు ఇద్దరు పిల్లలు పుట్టినారు. చిన్నపిల్లకేమో పదిమంది పుట్నారు చిన్నపిల్ల ఆ పదిమందిని సాకలేక, వాళ్ళకు కడుపు నిండా అన్నం పెట్టలేక నానా అవస్థలు పడేది. ఆ యింట్లో, ఈ యింట్లో పనులు చేసి, సంపాదిస్తూ వుండేది. పెద్దపిల్లకు బాగా డబ్బుంది గదా. అందుకని దానికి పొగరెక్కువ. చెల్లెల్ని చూడ్డానికి అసలు వచ్చేది గారు. ఎప్పుడన్నా ఎక్కడన్నా దార్లో కనబడ్డా అస్సలు పలకరించేది కాదు. కొంత కాలానికి పిల్లలు పెద్దగైనారు. పెద్దపిల్ల తన కొడుక్కి ఓ గొప్పింటి సంబంధం చసింది. పెండ్లికి పూర్లో అందర్ని పిలిచింది గానీ చెల్లెల్ని మాత్రం పిలవలా. వూర్లో అందరూ పెండ్లికి పోతావుంటే చిన్నపిల్ల వాళ్ళను "ఎక్కడికి పోతున్నారు" అనడిగింది. దానికి వాళ్ళు అడిగూడా తెలీదా. మీ అక్క కొడుకు పెండ్లి. చాలా గొప్పగా జరుగుతాంది. మేమంతా ఆడికే తావున్నాం" అన్నారు.