NANDANAVANAM by RAVULAPALLI SUNITHA Telugu book cover

NANDANAVANAM

by RAVULAPALLI SUNITHA

₹75
In stock · 384 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
నందనవనం * నవల * సాయంత్రం అయిదు గంటలు కావస్తోంది. అది నవంబరు నెల మొదటివారం! ఓటమిని జీర్ణించుకోలేనట్లు... ఎచెననిన్నబుచ్చుకున్న సూర్యుడు పశ్చిమాన కొండలవైపు త్వరత్వరగా గుతున్నాడు. వ్యాహ్యాళికొచ్చిన దేవదూతల్లా ఆకాశంలో తెల్లని మబ్బు తునకలు వ్యాసాలు పోతూ కదులుతున్నాయి. వారి వెనకే.... జీరాడుతున్న ధవళ అలా మబ్బుతునకల్ని అంటుకొని వున్న పల్చని మేఘం తెరలు అలవోకగా జడిస్తున్నాయి. కాస్తగా మిగిలివున్న సూర్యుడి వెచ్చదనాన్ని చల్లటి సముద్రపు గాలి తరిమి కొడుతోంది. చక్కని సాయంకాలాన్ని ఆస్వాదిస్తున్నట్లు ఆంధ్రా యూనివర్సిటీ ఆహ్లాదంగా వుంది. గ్రౌండ్లోని ఫౌంటెన్ నీళ్ళలో స్నానాలాడుతూ నీరెండలో మెరిసి పోతన్న పిట్టలు అల్లరల్లరిగా కిలకిలారావాలు చేస్తున్నాయి. ఫౌంటెన్ ప్రక్కనే ది వెళుతున్న వాళ్ళ చెవులను ఆ శబ్దాలు సుతారంగా తాకుతున్నాయి! ఆ సమయాన, బయటి చల్లని వాతావరణానికి భిన్నంగా... యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాలు అమ్మాయిల వాగ్ధాటితో వేడెక్కి వుంది. "సమాజంలో నేటి స్త్రీ" అన్న అంశం మీద అక్కడ సెమినార్ జరుగుతోంది.! హాలు నిండుగా వుంది. స్టేజిమీద సన్నగా, పొడవుగా, ఛామన నాయగా వున్న అమ్మాయి మాట్లాడుతోంది. సందర్భోచితంగా మధ్య మధ్యలో తెలుగు వాక్యాలు పలుకుతూ చక్కని ఆంగ్లంలో తన ఆలోచనలని వేదిక మీద నుండే జాలువారుస్తోంది! ఆత్మ విశ్వాసాన్ని ఒళ్ళంతా కవచంలా ధరించినట్లు, ఆమె నిటారుగా నిలబడిన తీరు వైవిధ్యంతోకూడి ఆకర్షణీయంగా వుంది! ఆమె వేసుకున్న లేత ఆకుపచ్చ పంజాబీ డ్రస్సు ఆమెకి మరింత హుందానిచ్చి చూపరుల కంటిని ఆకట్టుకుంటోంది. మైక్ లో ఆమె గొంతు అరుస్తున్నట్లు గాక నిలకడగా, నిండుగా మాటలోని భావాన్ని ప్రస్ఫుటంగా వ్యక్తపరుస్తోంది.