
NANNAKU SALAM
by P.SHAHANAZ
₹100
In stock · 4 available
PublisherP.SHAHANAZ
LanguageTelugu
స్వగతం నేను నా జీవితంలోని అనుభవాలను అనుభూతులను- సంగటనలను ఇతివృత్తాలుగా తీసుకుని కథలుగా మలచుకుంటూ ఉంటాను. సాధారణమైన వ్యవహారిక భాషలో వ్రాస్తుంటాను. ఇంతకు పూర్వం నా కథా సంపుటాలుబీ మౌన పోరాటం, 2. అనుమానం కాటేసిన వేళ, 3. శేష ప్రశ్నబీ వెలువడ్డాయి. ఒక నవల మానస బాంధవ్యం' వెలువడింది. అందులో సాధారణ కథలే ఎక్కువగా వ్రాశాను. కానీ ఈ కథా సంకలనంలో ఎక్కువగా ముస్లిమ్ కుటుంబ నేపథ్య కథలు వ్రాయటం జరిగింది. ఇక్కడ ఒక విషయం విన్నవించుకోవాలి. మనదేశంలో లేదా మన సమాజంలో ముస్లిమ్ కుటుంబ నేపథ్య కథలంటూ వేరుగా ఉండవు. భాషలు వేరయినా కుటుంబ వ్యవహారాలు- సాంప్రదాయాలు-అలవాట్లు ఒకేలా ఉంటాయి. మహిళల జీవిత స్థితిగతులు కూడా అందుకు భిన్నంగా ఉండవు. సమాజంలోని వ్యక్తుల జీవిత విధానం దాదాపు ఒకేలా ఉంటాయి. సమాజంలో అంతర్భాగమై జీవితాలను కొనసాగిస్తున్నారు. పిల్లల సమస్యలు ఆడపిల్లల పెళ్లిళ్లు- సమస్యలు కొడుకు కోడళ్ల ప్రవర్తనలు - తల్లిదండ్రుల పట్ల అనాదరణ మతాలకు అతీతంగా ఉండవు. మతాచారాలను మూఢాచారాలుగా విమర్శించడం సమంజసం కాదు. ధార్మిక ధర్మ శాస్త్రాలు ఎప్పుడూ మనుషులను సన్మార్గం వైపున నడిపిస్తాయి. జీవితపు విలువలను తెలపుతాయి. ఈ పుస్తకం ప్రచురించటానికి ప్రోత్సహించి, అన్ని విధాల తోడ్పడిన సోదరుడు ముహమ్మద్ ముజాహిద్కు నా ప్రత్యేకమైన కృతజ్ఞతాభివంనాలు. ఇంకా ఈ పుస్తకం తయారవ్వడానికి సహకరించిన సహృదయులైన ప్రతీ ఒక్కరికీ పేరు పేరు నా హ దయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కథా సంకలనంలోని కథలను ప్రచురించిన 'గీటురాయి' 'అనుపమ' సంపాదక వర్గానికి ధన్యవాదాలను తెలియజేసు కుంటున్నాను.