
NANNAYYA BHARATHA ANIMUTYALU
₹50
In stock · 13 available
PublisherS.R PUBLICATIONS
LanguageTelugu
ఒక్కమాట ! మన అమ్మభాష తెలుగులో వచ్చిన మొదటి రచన మహాభారతం. ఐదవ వేదంగా ప్రసిద్ధి పొందిన మహాభారతం ఎన్నో ధర్మాలు, శాస్త్ర విషయాలను చెబుతుంది. అటువంటి గొప్ప ఇతిహాసాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదం చేసి 'ఆదికవి'గా తెలుగు సాహిత్య చరిత్రలో శాశ్వతంగా కీర్తిపొందాడు. నన్నయ మహాకవి. సరైన వ్యవస్థ లేకుండా సాగుతూన్న తెలుగు సాహిత్యం, నన్నయ మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేసిన తర్వాత ఓ క్రమబద్ధమైన వ్యవస్థగా రూపొందింది. కేవలం సాహిత్య ప్రయోగాలకు మాత్రమే పరిమితం కాకుండా అనేక ధర్మసూక్ష్మాలు, నీతి నియమాలను బోధించే చక్కటి ధర్మశాస్త్ర గ్రంథంగా కూడా నన్నయ తన భారతాన్ని తీర్చిదిద్దాడు. ఇందుకు మూలకారకుడు రాజరాజ నరేంద్రుడు. తన పూర్వికుల కథ వినాలనే కోరికతో, తనకు అత్యంత ఆప్తుడు, విద్వాంసుడైన నన్నయను పిలిచి, భారతాన్ని తెలుగులో రచించమని అడుగుతాడు. ఆ విధంగా, రాజరాజ నరేంద్రుడి స్ఫూర్తితో నన్నయ తెలుగులో భారతాన్ని రచించడానికి శ్రీకారం చుట్టాడు. విమలాదిత్యుని తర్వాత రాజరాజు క్రీ.శ. 1019లోనే రాజుగా సింహాసనాన్ని అధిరోహించినట్లు తెలుస్తోంది. సోదరుడు విజయాదిత్యుడు కర్ణాటక (పశ్చిమ) చాళుక్యుల సహకారంతో రాజరాజుపై దాడి చేశాడు.