NARLA JEEVITHAM SAHITYAM by INAGANTI (NARLA)LAVAYNA Telugu book cover

NARLA JEEVITHAM SAHITYAM

by INAGANTI (NARLA)LAVAYNA

₹250
In stock · 30 available
PublisherINAGANTI (NARLA)LAVAYNA
LanguageTelugu
ముందు మాట పత్రికారంగంలో, సాహిత్యరంగంలో నార్లవారి కృషి అద్వితీయం. అర్ధశతాబ్దంపైగా యావత్ ఆంధ్రప్రదేశాన్ని ఉర్రూతలాడించడమే కాక వారి ఆలోచనావిధానాన్ని మార్చివేశారు. వారి సంపాదకీయాల కోసం యావత్ ఆంధ్రప్రదేశ్ ఎదురు చూసేదంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి గౌరవం మరే సంపాదకుడికి దక్కలేదు. ఎంతోమంది ప్రతిభావంతులను ప్రోత్సహించి వారి చేత కొన్ని శీర్షికలు రాయించేవారు. నేటి ప్రముఖ రచయిత్రులైన లత, కోడూరి కౌసల్యాదేవి, రంగనాయకమ్మ, మాలతీచందూర్ మొదలైన రచయిత్రులను ప్రోత్సహించి వారికి తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానం కల్పించారు నార్ల. వారు రచనల ద్వారా ప్రపంచమంతటిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అటువంటి గౌరవం దక్కిన అరుదైన పత్రికా సంపాదకులలో నార్లవారు ఒకరు. నార్లవారి పేరు మీద అమెరికాలో ఒక వీధి ఉండటం విశేషం. "దేశ స్వాతంత్ర్యానికి ముందే వారు పత్రికారంగంలోకి అడుగుపెట్టారు. అప్పటికే తెలుగు పత్రికారంగం వికాస దిశలో పయనిస్తున్నది. వారికి ముందుగా పత్రికారంగంలో ఉన్న వీరేశలింగం, ఖాసా సుబ్బారావు మొదలైన ప్రముఖులు వేసిన బాటలో నడుస్తూ రెండు ప్రముఖ పత్రికలకు సంపాదకత్వం వహించి తనదైన శైలిలో కొత్త పుంతలు తొక్కారు. భావాన్ని వ్యక్తీకరించుటలో విశేషతను, వైశిష్ట్యాన్ని సంతరించుకొన్న రచయితలలో నార్లవారు ప్రముఖులు. వారి శైలి నిర్దేశానికి వారి రచనలే సాక్ష్యం. వారి పత్రికారచనా విధానం ఒక్కొక్కసారి ఉత్తేజపూరితంగాను, ఆవేశంగాను, ఒక్కొక్కసారి విమర్శనాత్మకంగాను మరోసారి నిర్మాణాత్మకంగా సాగేది. వారి నిర్మాణాత్మక రచనా విధానం, వారు ఖండించే అంశాలు, కొత్త ఆలోచనలను, భావాలను ప్రవేశపెట్టేవిగా వున్నాయి. సమకాలీన సమాజానికి ఉపయుక్తమైన శైలిలో వారి పత్రికా రచన సాగింది. వారిది చాలా ఆకర్షకమైన, శక్తివంతమైన శైలి.